మా నాన్న గారి కల నెరవేరబోతోంది

ఎమ్మెల్యే అంబటి రాంబాబు
 

అమరావతి: బాపట్ల ప్రత్యేక జిల్లా కావాలని మీ తండ్రి కోన ప్రభాకర్‌ కలలు కన్నారని, ఆ కల వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో నెరవేరబోతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. డిప్యూటి స్పీకర్‌గా ఎన్నికైన కోన రఘుపతిని రాంబాబు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మీరు ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. మీ తండ్రిగారు ఆర్థిక మంత్రిగా, స్పీకర్‌గా, గవర్నర్‌గా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. మీ తండ్రి గారు ఎంతో మంచి పనులు చేశారు. మీరు నటులు కూడా. మీరు నటించిన సినిమా చూశాం. మీరు ఆ నేపథ్యంలో వచ్చారు.

మీ తండ్రి గారు ఎప్పుడు బాపట్ల సెంటర్‌గా జిల్లా ఏర్పాటు కావాలని భావించేవారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చాలని భావిస్తున్నాం. మీ నాన్నగారి ఆలోచన ఇప్పుడు నెరవేరబోతోంది. మీరు అందరి కంటే సౌమ్యూలు, చాలా నిరాండంరంగా, వివాదరహితంగా ఉండే వ్యక్తి. బాపట్ల నియోజకవర్గంలో ఆ రోజుల్లో కోన ప్రభాకర్‌గారు గెలిచి ఉండవచ్చు. ఆ రోజుల్లో ఇండిపెండెంట్‌ సృహతో గెలిపించారు. రాను రాను సామాజికవర్గాలుగా విడిపోయారు.

మీ సామాజిక వర్గం చాలా చిన్నది. అయినా కూడా మీ కుటుంబంపై ఉన్న అభిమానంతో వైయస్‌ జగన్‌ గారు టికెట్‌ ఇస్తే మీరు రెండుసార్లు గెలిచి సభకు వచ్చారు. అలాంటి మిమ్మల్ని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. గతం శాసన సభలో డిప్యూటీ స్పీకర్‌ పోస్టును చూశాను. అప్పట్లో మూడు, నాలుగు గంటలు మాత్రమే డిప్యూటీ స్పీకర్‌ కూర్చున్నారు. అలా కాకుండా మీ పాత్ర సంపూర్ణంగా నిర్వహించాలని కోరుతున్నాను. నేను 1989లో ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యే సమయంలో మీ తండ్రి గారు నాకు టికెట్టు ఇచ్చే విషయంలో మీ తండ్రి గారు కోన ప్రభాకర్‌ గారు సహకారం అందించారు. చక్కని క్రమశిక్షణ కలిగిన మీరు ఈ బాధ్యతల్లో బ్రహ్మండంగా పేరు తెచ్చుకోవాలని, మరోమారు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top