చంద్ర‌బాబు బుద్ధి మార్చుకోవాలి

పార్వ‌తీపురం జ‌నాగ్ర‌హ దీక్ష‌లో ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు

విజ‌య‌న‌గ‌రం: చంద్ర‌బాబు త‌న బుద్ధి మార్చుకోవాల‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత‌లు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వ‌ర్యంలో జ‌నాగ్ర‌హ దీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున దీక్ష‌లో పాల్గొన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయ‌కులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు తీరు మార్చుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తంచేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మూడు మండలాలకు చెందిన  సర్పంచులు, ఎంపీటీసీలు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top