విశాఖ: దేశ చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా 31 లక్షల పైచిలుకు మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్‌కే దక్కుతుందని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజు అన్నారు. విశాఖకు సంబంధించి 1.26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పెందుర్తి వచ్చిన సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, స్థానిక మాజీ శాసనసభ్యులు గత 5 సంవత్సరాల్లో పట్టుమని 5గురికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. కేవలం పెందుర్తి నియోజకవర్గంలో రూరల్, అర్బన్ కలుపుకొని సుమారు 70 వేల మందికి మనం ఇళ్ల పట్టాలు అందజేస్తున్నాం. 70 వేలు అంటే ఇంటికి ముగ్గురు అనుకున్నా.. 2 లక్షల మందికి శాశ్వత నివాసం కల్పించారు. చంద్రబాబు పేదల భూములు తీసుకొని రియలెస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తుంటే.. సీఎం వైయస్ జగన్ ఆ భూములను పేదలకు పంచి శాశ్వత నివాసాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని దుర్మార్గపు ప్రతిపక్షం కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు. జగన్ గారి మాట.. గన్‌లో తూటా రెండూ ఒకటే. పారదర్శక పద్ధతిలో ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడా కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు, రాజకీయాలు చూడకుండా ప్రభుత్వం పనిచేస్తోంది. బండారు సత్యనారాయణ సొంత గ్రామంలో టీడీపీ అధ్యక్షుడు భార్య గొంప సునీతకు కూడా ఇళ్ల పట్టా ఇచ్చాం. టీడీపీ బీఫాంతో ఎంపీటీసీగా నామినేషన్ వేసిన వాడచీపురుపల్లి అభ్యర్థికి కూడా ఇళ్ల పట్టా ఇచ్చాం. కరోనా సమయంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. సంక్షేమ పథకాలు ఆపలేదు. ప్రజల ఇబ్బందులే.. తన ఇబ్బందులుగా భావించి పేదలందరికీ సాయం అందించారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే.. కరోనాపై కత్తియాత్ర అనే పథకాన్ని పెట్టేవాడు’ అని ఎమ్మెల్యే అదీప్‌రాజు ఎద్దేవా చేశారు.