వైయస్‌ఆర్‌సీపీలోకి  భారీ చేరికలు

చంద్రబాబును నమ్మి మోసపోయాం

గిడ్డంకుల సంస్థ మాజీ ఛైర్మన్‌ రమేష్‌నాయుడు

కృష్ణా జిల్లా:జిల్లాలో టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి.గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్‌  రమేష్‌నాయుడు,కాంగ్రెస్‌ నేతలు మాధవి,బొప్పన సుబ్బారావు, శివాజీ,పలువురు ప్రముఖ నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వారికి వైయస్‌ఆర్‌సీపీ నేత పేర్నినాని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాయని రమేష్‌ నాయుడు అన్నారు.నాయకుడు అంటే ఎలా ఉండాలో వైయస్‌ఆర్‌ను చూసి చంద్రబాబు ఎంతో నేర్చుకోవాలన్నారు.పేర్ని నాని మాట్లాడుతూ వైయస్‌ఆర్‌సీపీ నిర్ణయాన్ని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారని తెలిపారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సంక్షేమపథకాలకు దూరమైన ప్రజలు పూర్తిస్థాయిలో సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు.

 

Back to Top