అధికారం శాశ్వతం కాదు.. 

కూటమికి వైయ‌స్ఆర్‌సీపీ నేతల హెచ్చరిక
 

తూర్పుగోదావరి: ఏపీలో కూటమి ప్రభుత్వం హింసాత్మక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారువైయ‌స్ఆర్‌సీపీ నేతలు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు.

మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు బెయిల్ మంజూరైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శ్రీకాంత్ విడుదలయ్యారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కోసం వైయ‌స్ఆర్‌సీపీ నేతలు జైలు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు.  

ఇప్పటి కంటే వడ్డీతో సహా కూటమి నేతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు. పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో నాయకులు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్నారు.  ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అడిగినందుకే కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ పేరుతో ఎన్నికల ముందు బెదిరించి గెలిచిన తర్వాత వాటిని అమలు చేయటం దారుణం. ఒకవైపు హింసాత్మక చర్యలు ఉండవంటూనే మరోవైపు హింసాత్మక చర్యలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం హింసాత్మక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు.

రామచంద్రపురం వైయ‌స్ఆర్‌సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ..‘మాజీ మంత్రి పైన అతని కుమారుడి పైన కేసులు పెడతామని మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా.‌‌ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో మంత్రి బహిరంగంగా చెప్పాలి.  ఎన్నికల అఫిడవిట్లో మంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అడగడం తప్పా?. ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో ఆలోచించండి అంటూ హితవు పలికారు. 

Back to Top