కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు కరువైన రక్షణ

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు మండిపాటు

18 నెలల్లో దేవస్థానాల్లో వరుస అకృత్యాలు, అపచారాలు

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు ఆరోపణ

అదే అదునుగా నానా యాగీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

సీబీఐ నివేదిక సాక్షిగా బయటపడ్డ కూటమి కుట్ర

రాజకీయాల కోసం దేవదేవుడ్నీ వదలని చంద్రబాబు

వాస్తవం బయటపడ్డంతో ఉలిక్కపడి మరలా దుష్ప్రచారం

లడ్డూ ప్రసాదం కల్తీ రుజువైందంటూ భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు

ప్రజలు మిమ్నల్ని ఎప్పటికీ క్షమించరు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై  మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్

స్వామి వారి ప్రసాదంపై పై అపవాదు వేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలి

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్

కూటమి పాలనలో ప్రమాదంలో హిందూ ధర్మం

ఆలయాల్లో వరుస అకృత్యాలు, అపచారాలు

అయినా పట్టని కూటమి ప్రభుత్వం

25 అంశాలతో దేవాదాయశాఖ కమిషనర్ కి వినతిపత్రం

లడ్డూపై తప్పుడు చంద్రబాబు, కూటమి నేతల దుష్ప్రచారం

ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు డిమాండ్ 

విజయవాడ:  కూటమి ప్రభుత్వంలో  ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని.. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో దేవస్థానాల్లో వరుస అకృత్యాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. దేవస్థానాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ  విజయవాడ దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ నేత‌లె కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ ... తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అన్న చంద్రబాబు వ్యాఖ్యలు, అదే అదునుగా నానా యాగీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేష్టలు సీబీఐ నివేదిక సాక్షిగా అబద్దాలని తేలిపోయిందన్నారు. కేవలం రాజకీయాల కోసం దేవదేవుడ్ని వాడుకోవడం దారుణమని మండిపడ్డారు. సీబీఐ నివేదికలో అసలు వాస్తవం బయటపడ్డంతో ఉలిక్కపడి.. మరలా దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును ప్రజలు ఎప్పటికీ క్షమించరని తేల్చి చెప్పారు. మరోవైపు  స్వామి వారి ప్రసాదంపై పై అపవాదు వేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...  ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

● వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో వరుస అపచారాలు, దొంగతనాలు, తొక్కిసలాటలో భక్తుల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 18 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దేవస్థానాల్లో జరుగుతున్న అకృత్యాలపై దేవాదాయశాఖ కమిషనర్ కి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వినతిపత్రం సమర్పించాం. తాజాగా అన్నవరంలో ప్రసాద విక్రయ కేంద్రంలో విచ్చలవిడిగా ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలు అందరూ చూసి విస్తుపోయారు. అలా ఎలుకలు తిరుగుతుంటే భక్తులు  ఏ విధంగా ప్రసాదం స్వీకరించగలుగుతారు. అదే విధంగా సింహాచలం చందనోత్సవంలో గోడకూలి ఆరుగురు భక్తులు చనిపోతే.. ప్రమాదానికి కారణమైన వారి పై ఏం చర్యలు తీసుకున్నారు? కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసరలాట జరిగి భక్తులు చనిపోయినా పట్టించుకోలేదు. అదే ఆలయంలో దొంగతనం జరిగినా ఇంతవరకు చర్యలు లేవు. 
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు, హిందూ భక్తులకు రక్షణ లేకుండా పోయింది. భక్తుల రక్షణలో కూటమి ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ముక్కోటి ఏకాదశినాడు భక్తులు చనిపోవడం చరిత్రలో ఎప్పుడూ లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన అకృత్యాలుకు అంతులేకుండా పోతుంది.

టీటీడీ ఈవో గా జూన్ 14 నాడు శ్యామలరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్ 21న ఆయన తిరుమలలో నెయ్యితో పాటు అన్ని సరుకులు నాణ్యత బాగుందని ఆయనే చెప్పారు. కొద్ది రోజుల తర్వాత నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు. రెండు నెలల తర్వాత సీఎం చంద్రబాబు నెయ్యిలో జంతుకొవ్వు,  పందికొవ్వు తో తయారు చేసి లడ్డూ తయారీలో వాడారని చెప్పడం చాలా బాధాకరం. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ సినిమా షూటింగ్ తరహాలో డ్రెస్సు మార్చుకుని విజయవాడ అమ్మవారి గుడి మెట్లు కడగడమే కాకుండా.. నానా యాగీ చేశాడు. ఇవాళ చివరికి లడ్డూ వ్యవహారంలో సీబీఐ చాలా స్పష్టంగా జంతు కొవ్వు లేదని సీబీఐ కోర్టుకు నివేదిక ఇచ్చింది. ఇప్పటికైనా చేసిన తప్పును అంగీకరించి, శ్రీ వేంకటేశ్వరస్వామి ఎదుట లెంపలు వేసుకోవాల్సిన కూటమి నేతలు.. సిగ్గు లేకుండా తిరిగి మరలా తప్పుడు ప్రచారానికి తెరతీశారు. ప్రజలు ఎక్కడ తమ నాటకాన్ని తెలుసుకుని నిలదీస్తారోనన్న భయంతో సిబీఐ నివేదికను సైతం వక్రీకరిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందని... ఫ్లెక్సీలు, హోర్డింగులు పెడుతున్నారు. 
కనీస బుద్ధీ, జ్ఞానం లేకుండా తిరుమల లడ్డూని తమ నీచమైన రాజకీయాలకు వాడుకుంటూ దేవుడ్ని కూడా రోడ్డు మీద తీసుకొస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ..నీచ రాచకీయాలు చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలను ఎవరూ క్షమించరని వెల్లంపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదం మీద అపవాదు వేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

● మల్లాది విష్టు, మాజీ ఎమ్మెల్యే.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మానికి తీరని అన్యాయం చేస్తుంది. గడిచిన 20 మాసాల్లో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో అపచారాలు, అకృత్యాలు, చోరీలు వంటి దారుణాలతో పాటు ఎన్నడూ లేని విధంగా క్యూలైన్ల తొక్కిసలాట మరణాలు వంటి దాదాపు 25 అంశాలతో కూడిన నివేదికను దేవాదాయశాఖ కమిషనర్ కి సమర్పించాం. అదే విధంగా అర్చకులపై దాడులు, గోశాలల్లో చనపోతున్న ఆవులు, ఆలయాల్లో జరుగుతున్న అపచారాలను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాం. హిందూ ధర్మం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 
కేవలం  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ కుట్రలో భాగంగా ఏకంగా ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న చంద్రబాబు లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ.. కుట్రకు తెరతీశారు. ఇవాళ సీబీఐ ఆధ్వర్యంలో ని సిట్ అధికారులు.. నెయ్యిలో జంతు కొవ్వు లేదని కోర్టుకు నివేదిక ఇవ్వడంతో వీరి బండారం బయటపడింది. దీంతో ఉలిక్కి పడ్డ కూటమి నేతలు... చేసిన తప్పు రాష్ట్ర ప్రజలకు తెలిసిపోతుందన్న భయంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల లడ్డూపై మరలా హోర్డింగులు ద్వారా అదే దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కునే దైర్యం లేక, ప్రజలకు చేసిన మేళ్లేమీ లేకుండా రాజకీయ లబ్ది కోసం, లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
శ్రీకాళహస్తిలో రూ.500 టిక్కెట్ కొనుక్కుంటే వచ్చే పూజాసామాగ్రి లో ఇచ్చే వెండి పడగలను కూడా కూటమి నేతలు బయట వెండిషాపుల్లో అమ్ముకుంటున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. 
వైయస్.జగన్ ఇచ్చి పథకాలు కన్నా ఎక్కువ సంక్షేమం చేస్తానని మాట ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ .. ఇవాళ ఆలయాల్లో భక్తులను దోచుకునే స్థితికి దిగజారారు. 
అన్నవరం సత్యదేవుడి దేవస్థానం ప్రసాదం స్టాల్ లో ఎలుకలు తిరుగుతున్నాయంటే.. రాష్ట్రంలో దేవస్థానాల్లో ఎంతటి దారుణమైన పరిస్థితులున్నాయో అర్ధం అవుతుంది. అదే విధంగా ద్రాక్షారామంలో మీ పార్టీ నేతలు శివలింగాన్ని పగలగొట్టారు. ఆలయాల రక్షణపై మీకున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. 
రథసప్తమి రోజు శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవస్థానంలో అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తొక్కిసలాట జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భక్తులకు  దేవాదాయశాఖ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోడం దారుణం. దేవాలయాల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదే నిదర్శనం. అదే విధంగా బ్రాహ్మణులకు సంబంధించి విశాఖలో బోడెమ్మ సత్రంలో పూజాకార్యక్రమాలు, పిండప్రదానాలు చేసే చోట ఆ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకున్న టీడీపీ నేత దాన్ని జీవీఎంసీ స్థలం అని మాట్లాడ్డం దారుణం. వరుసగా రాష్ట్రంలో ఆలయాల మీద జరుగుతున్న అకృత్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించాం. అదే విధంగా బ్రహ్మణ సామాజిక వర్గంలో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం రూ.10 వేలు ఇచ్చే గరుడ స్కీమ్ వైయస్.జగన్ హయాంలో అర్హులందరికీ అందిస్తే...  ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని నిలిపివేసింది. సైట్ కూడా ఓపెన్ చేయలేదు. అదే విధంగా రాష్ట్రంలో దేవాలయాలకు దాతలిచ్చిన భూమిని తమకు కావాల్సిన వారికి  జీవో నెంబరు 15 ద్వారా కట్టబెట్టే విధంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని ఇతర అవసరాల కోసం  ఎలా కట్టబెడతారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ  తరపున ఇచ్చి 25 అంశాలపై తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు, తిరుమల లడ్డూపై తప్పుడు మాటలు మాట్లాడిన కూటమి నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Back to Top