చంద్రబాబును అరెస్టు చేయాలి

గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు 
 

గుంటూరు:  పోలీసుల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీసేలా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఈమేరకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు విడదల రజని, మహ్మద్ ముస్తఫా తదితరులు ఫిర్యాదు చేశారు. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా వారు మాట్లాడుతున్నరని, డీజీపీ గౌతం సవాంగ్ పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, వర్ల రామయ్యను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: రాష్ట్రాన్ని గబ్బుపట్టించింది చంద్రబాబే

తాజా వీడియోలు

Back to Top