చంద్రబాబు కుట్రలను అడ్డుకోవాలి

సీఈసీకి వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు
 

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అఖరి ప్రయత్నంగా చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. బుధవారం వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి, తదితరులు సీఈసీని కలిశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ..మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖరి ప్రయత్నంగా..మరిన్ని కుట్రలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ అనుకూల అధికారుల బదిలీలపై..స్వయంగా ముఖ్యమంత్రి నిరసనకు దిగి..రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి, ప్రశాంతతను చెడగొట్టేందుకు, ఓటరు తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వీలు లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లు మీడియాకు ఇచ్చిన లీకుల ద్వారా మాకు సమాచారం అందింది. దీనిని అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా..ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల కమిషన్‌ తక్షణ చర్యలు తీసుకోవాలని సీఈసీ అధికారులను కోరారు.
 

Back to Top