పసలేని విమర్శలు చేసి పరువు తీసుకోవద్దు

యనమల రామకృష్ణుడిపై ఎంపీ విజయసాయిరెడ్డి  ఫైర్‌
 

అమరావతి : పసలేని విమర్శలు చేసి పరువు తీసుకోవద్దని విమర్శలపై  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి హితవు పలికారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సీనియర్‌ నేత, ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించారు. సీఎం వైయస్‌ జగన్‌పై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్నికలకు ముందు ఇలాంటి  చౌకబారు విమర్శలు చేసే ప్రతిపక్షానికి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. "ఏమైంది యనమల గారూ? తెలంగాణ లబ్ది కోసం జగన్‌ గారు రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారా? ఆర్ధిక మంత్రిగా రాష్ట్రాన్ని20 ఏళ్లు వెనక్కు నెట్టిన ఘనులు మీరు. ఎన్నికల ముందు కూడా ఇలాగే కేసీఆర్, మోదీలతో చేతులు కలిపామని ఆరోపణలు చేస్తే ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా?''అని పేర్కొన్నారు.

Back to Top