జగన్‌ అంటే విధేయత.. జగన్‌ అంటే జనహోరు

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన బాధ్యత అందరిపై ఉంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చిలకలూరిపేట సమన్వయకర్త రజిని

పశ్చిమగోదావరి: జగన్‌ అంటే విధేయత, జగన్‌ అంటే విశ్వసనీయత, జగన్‌ అంటే జనహోరు.. జగన్‌ అంటే జన జాతర అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త రజిని అన్నారు. ప్రజల ఎదురుచూపుతో చంద్రబాబు గుండెల్లో చమటల ఉక్కుపాదం కురుస్తుందన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. కరువుతో ప్రజలంతా అల్లాడుతుంటే కరువుపై దరువు అంటూ, కరువుతో కలబడతామంటూ ఎల్లో మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. తుపాన్‌పై తొలి విజయం అంటూ మాయపకీర్‌లా వ్యవహరిస్తున్నాడన్నారు.

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో బెస్టు క్యాటరిగీలో ఉన్న బీసీలు, చంద్రబాబు పాలనలో బిలో కేటాగిరిలోకి వెళ్లారన్నారు. మళ్లీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే బెస్ట్‌ క్యాటగిరిలోకి తెచ్చుకుందామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాలన రెండు వ్యాఖ్యాల్లో చెప్పాలన్నారు. లోకేష్‌ పాలన క్యాష్‌బోర్డు పాలన లాంటిదని, ముఖ్యమంత్రి పాలన డ్యాష్‌ బోర్డు లాంటిదన్నారు. డ్యాష్‌ బోర్డు చూస్తే కానీ క్యాష్‌బోర్డు పనిచేయని పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 

 

Back to Top