చంద్రబాబుకు సీఎం గా ఉండే అర్హత లేదు 

వైయ‌స్ఆర్‌సీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్  

విశాఖ‌:  ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌ని చంద్ర‌బాబుకు ముఖ్య‌మంత్రిగా కొన‌సాగే అర్హ‌త లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్ హెచ్చ‌రించారు. ఏడాది పాల‌న‌లో ఏమీ సాధించ‌లేని చంద్రబాబుకు మహానాడులో గొప్ప‌లు చెప్పుకోవ‌డం సిగ్గు చేటు అన్నారు. మహానాడు నిర్వహించడానికి చంద్రబాబు సిగ్గు ఉండాల‌న్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి మహానాడులో ఆయ‌న‌తో ఏఐ ద్వారా పొగిడించుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో సూపర్‌ సిక్స్‌ అంటూ కొన్ని ఎన్నికల హామీలను ప్రకటించిన తరువాత ఆయన ‘‘అదిరిందా తమ్ముళ్లూ.. అదిరిందా’’ అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నార‌ని గుర్తు చేశారు. తాజాగా ఇప్పుడు కడపలో జరిగిన మహానాడులోనూ వాటిని ప్రస్తావించారు. అలాగే.. పాలన అదురుతోందా? రాజమండ్రిలో చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం కదా. ప్రజలంతా అదిరిపోతున్నారా? అని కార్యకర్తలను అడగాలి కదా! కానీ ఎందుకో మరి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఆ సాహసం మాత్రం చేయలేకపోయారు!. ఎందుకు జరుగుతోందో? ఏమి సాధించాలని అనుకుంటున్నారో తెలియకుండా సాగిన మహానాడు బహుశా ఇదేనేమో! అని వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్ ఎద్దేవా చేశారు.  చంద్ర‌బాబు ఏడాది పాలనలో ప్రజలకు చేసింది శూన్యమ‌న్నారు. దొంగ హామీలతో ఆరు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేశార‌ని ఆయ‌న ఆక్షేపించారు.

Back to Top