ఏపీకి పట్టిన శని తొందరలోనే వీడిపోతుంది

మరో 28 రోజులు బాబు చెంప పగులగొట్టే తీర్పు

హిందూజా కంపెనీ ఆరోపణలపై దమ్ముంటే చంద్రబాబు చర్చకు రావాలి

లేదంటే క్షమాపణలు చెప్పి రాజకీయాల నుంచి తప్పుకోవాలి

బాబుది ధన బలం.. వైయస్‌ జగన్‌ది ప్రజాబలం

ఇక చంద్రబాబును ఎల్లో మీడియా కూడా కాపాడలేదు

పనికిమాలిన జన్మభూమి కమిటీలే చంద్రబాబు పార్టీకి మరణశాసనం 

బాబు గజదొంగ, కొడుకు డేటా దొంగ

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు

హైదరాబాద్‌: ఆంధ్రరాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు. మరో 26 రోజుల్లో చంద్రబాబు చెంప పగులగొట్టే తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. అయినా సిగ్గురావడం లేదు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తూ తన ఎల్లోమీడియాతో ప్రజల మధ్యకు వదులుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి శాశ్వత మరణశాసనం లికించడానికి రాష్ట్ర ప్రజలు రోజులు లెక్కబెట్టుకుంటున్నారన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకొని ఏ విధంగా చంద్రబాబు ఇప్పటి వరకు పబ్బం గడిపాడో.. ప్రస్తుతం అదే పచ్చమీడియాతో వైయస్‌ జగన్‌పై నిందలు వేస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేయాలని కుట్ర చేస్తున్నాడన్నారు. చంద్రబాబు కుట్ర పరాకాష్టకు చేరిందన్నారు. వైయస్‌ జగన్‌పై చంద్రబాబు చేసే ప్రతి ఆరోపణ వైయస్‌ఆర్‌ సీపీకి శ్రీరామరక్షగా భావిస్తున్నామన్నారు. హిందూజా కంపెనీ, 11 ఎకరాలు అని తప్పుడు కథనాలను వండివార్చి ప్రజల మధ్యకు వదిలిన చంద్రబాబు, దమ్ముంటే ఆధారాలతో చర్చకు రావాలని సుధాకర్‌బాబు సవాలు విసిరారు. చంద్రబాబు నిజంగా నారావారిపల్లెలో పుట్టి ఉంటే చర్చకు సిద్ధపడాలన్నారు. 

చంద్రబాబు బలం ధనం, ఎల్లో మీడియా, కుట్ర, కుతంత్రాలు అయితే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్‌ జగన్‌ బలం ప్రజలు, విశ్వసనీయత, విశ్వాసం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వమని సుధాకర్‌బాబు అన్నారు. విరుద్ధమైన ఈ రెండు భావాజాలాల మధ్య పోరాటం జరుగుతుందని, వంచనతో కూడుకున్న దొంగచాటు రాజకీయం చంద్రబాబుది అయితే.. చెప్పిన మాటకు కట్టుబడి సూటిగా మాట్లాడే వ్యక్తి వైయస్‌ జగన్‌కు మధ్య మహాసంగ్రామం జరుగుతుందన్నారు. చంద్రబాబను భుజాన మోసే ఎల్లో మీడియా ఆయన్ను ఏమాత్రం కాపాడలేదని, వైయస్‌ జగన్‌ విశ్వసనీయత ఆకాశాన్ని అంటిందన్నారు. పాదయాత్ర అనంతరం ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అధ్యయాన్ని వైయస్‌ జగన్‌ లిఖించాడన్నారు. 

2009లో వైయస్‌ జగన్‌కు హిందూజా అనే కంపెనీ 11 ఎకరాల భూమి వారి సొంత డబ్బులతో రిజిస్ట్రర్‌ చేసిందని తప్పుడు కథనాన్ని చంద్రబాబు ప్రజల మధ్యకు వదిలాడని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆధారాలతో చర్చకు రావాలని, లేదంటే ప్రతిపక్ష నేతపై తప్పుడు ఆరోపణ చేశానని క్షమాపణలు చెప్పి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు మతిమరుపు వ్యాధి ఎక్కువైందని, గంట క్రితం మాట్లాడిన మాట గుర్తుండడం లేదన్నారు. దొంగే దొంగ అని అరిచినట్లు నారావారి పల్లె నుంచి ఆంధ్రరాష్ట్ర నడిబొడ్డులోకి వచ్చి తండ్రీకొడుకులు కృష్ణానది ఒడ్డున దొంగ నివాసం ఏర్పాటు చేసుకొని గజదొంగల ముఠాను ప్రారంభించారన్నారు. అమాయక ప్రజల భూములు లాక్కున దొంగ చంద్రబాబు అని సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేవారు. 

నారావారి కంత్రీలంతా కలిసి ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకొని దానిపై విహారం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అవమానించిన రోజే చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ఏపీ కంకణం కట్టుకుందన్నారు. చంద్రబాబుకు ఇతర కులాలు, మతాలంటే చులకన భావమని, కేవలం ఒక్క సామాజికవర్గం కోసం చంద్రబాబు పనిచేస్తున్నాడన్నారు. ఈడీకి సీబీఐకి మధ్య లేఖలు నీ దగ్గరకు ఎలా వచ్చాయని చంద్రబాబును ప్రశ్నించారు. సుజనా చౌదరి అనే బ్యాంక్‌ దొంగ, సీఎం రమేష్‌ అనే ఏసీబీ కేసులో ఇరుక్కున్న దొంగ, నామా నాగేశ్వరరావు అనే ఈడీ కేసులో ఇరుక్కున దొంగ, వాకాటి నారాయణరెడ్డి, రాయపాటి సాంబశివరావు లాంటి పోలవరం దొంగ ఎవరి పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. 

కుల ధ్రువీకరణ పత్రం కావాలన్నా పనికిమాలిన జన్మభూమి కమిటీల సంతకం కావాలా చంద్రబాబూ అని సుధాకర్‌బాబు ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనిని జన్మభూమి కమిటీలకు ఇచ్చి వారిని కించపరిచారని, ఇల్లు, రేషన్, పెన్షన్‌ నుంచి చివరకు మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చాడన్నారు. జన్మభూమి కమిటీలే బాబుకు మరణశాసనం రాస్తున్నాయన్నారు. తండ్రి గజదొంగ, కొడుకు డేటా దొంగ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు దొంగలించబడినవని, లోకేష్‌ శాఖలో దొంగతనం జరిగితే బయటకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన డేటా దొంగ లోపల కూర్చొని క్యాష్‌ లెక్కబెట్టుకుంటున్నాడన్నారు.  ఎందుకు లోకేష్‌తో ప్రెస్‌మీట్‌ పెట్టించలేకపోతుర్నారని, లోకేష్‌కు మాట్లాడడం రాదా..? మాట్లాడితే దొరికిపోతాడని భయమా..? దొంగతనం అంగీకరిస్తాడని భయంతో దాచిపెట్టారా అని ప్రశ్నించారు. చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్టును తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారన్నారు. 

 

Back to Top