సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం

పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి  ఫిర్యాదు

ప‌ల్నాడు: గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి టిడిపి నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. షర్మిలపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి పోస్టులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. “దాసి” అనే పదానికి అసలు అర్థం తెలుగులో ఏమిటో ఉపాధ్యాయులు చెప్పినా టిడిపి నాయకులు అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు.

అధికారంలో ఉన్నామని అహంకారంగా మాట్లాడుతున్నారని, “మాకు అధికారం ఉంది, మేము నరకగలం” అనే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. గతంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ, వంగవీటి రంగ హత్య, రాజారెడ్డి హత్య వంటి సంఘటనలపై టిడిపి నాయకుల పాత్రను ప్రశ్నించారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదేనని ఆరోపిస్తూ, ఇటువంటి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
 

Back to Top