ఒంగోలు: వైయస్ఆర్‌సీపీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు వ్యక్తిత్వ హననాలు, తప్పుడు కేసులు, అనుకూల మీడియా సాయంతో దుష్ప్రచారాలకు దిగుతున్నారని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అమరావతి కోసం లక్షల కోట్లు పెట్టేందుకు సిద్దమైపోతున్నారని, అన్ని విధాలా మంచిదైన మావిగన్ ప్రతిపాదన చేస్తే మాత్రం ట్రోలింగ్స్ చేయిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఏమాత్రం నైతిక విలువల్లేని వ్యక్తి చంద్రబాబు అని, ఎన్డీయేలో ఉంటూ రేవంత్ తో చెట్టపట్టాల్ వేసుకుని తిరగడమే దీనికి నిదర్శనం అన్నారు. ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే.. - మావిగన్ పై చంద్రబాబు దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన తెస్తే, అదేదే బూతుపదం అయినట్లు రకరకాలుగా ట్రోలింగ్ చేయించారు. తిరుపతి లడ్డూలో కొవ్వులు కలిశాయని అప్పట్లో తప్పుడు ప్రచారం చేయించి విఫలమయ్యారో ఇప్పుడు మావిగన్ ప్రతిపాదనపైనా అలాంటి ప్రచారాలకే దిగారు. మావిగన్ ఓ అద్బుతమైన ప్రతిపాదన. అమరావతి ఎంత ఖర్చుతో, ఎప్పుడు పూర్తవుతుందో ఎవరైనా చెప్పగలిగే పరిస్ధితి ఉందా ? 12 ఏళ్ల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఓ అద్భుతమైన పట్టాణాన్ని నిర్మించి రాజధానిగా చేసుకోవాల్సిన అవసరం ఉందా ? మనకు పట్టణాలు లేవా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పట్టణాల్ని రాజధానులుగా ఎంచుకున్నాక అవి ద్విగుణీకృతంగా పెరిగాయి. చంద్రబాబుకు జ్ఞానం, తెలివితేటలు ఉంటే తనకు ఇష్టమైన పట్టణాల్లో ఒకదాన్ని రాజధానిగా ఎంచుకోవచ్చు. కానీ అలా చేయకుండా లక్షల కోట్లు కాజేసేందుకు అమరావతిని ఎంచుకున్నారు. అందుకే ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు 16 వేల నుంచి 20 వేలు ఖర్చుపెడుతున్నారు. బెంగళూరు, హైదరాబాదుల్లో 4500 కే చదరపు అడుగుకు ఖర్చవుతుంది. చంద్రబాబు తనకు ఉన్న దోపిడీ దారులు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే ఇదంతా. వాళ్లకు దోచిపెట్టి, వాళ్ల నుంచి తిరిగి ముడుపులు తీసుకునే పరిస్ధితికి ఆయన దిగజారిపోయారు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు అమరావతిపై తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. - రాష్ట్రమంతా వదిలేసి అమరావతి చుట్టూ చక్కర్లు రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉండగా.. అమరావతికి మాత్రం 75 వేల కోట్ల ప్రతిపాదనలు పెడుతున్నారు. డబ్బులు లేకపోయినా అప్పులు చేసి పప్పుకూడుకు సిద్ధమైపోతున్నారు. మిగతా కార్యక్రమాలన్నీ పక్కనబెట్టేశారు. పేద ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్లు లేవు. కేవలం దండుకు తినాలనే ఉద్దేశంతో మాత్రమే అమరావతి ప్రతిపాదన తెచ్చి రాజధాని పెట్టారు. అసలు అమరావతి ఎక్కడుంది, రాజధాని ఎక్కడుంది ? గుంటూరు వెళ్లి బస్సులో అమరావతికి టికెట్ కొట్టమంటే అమరావతి గుడి దగ్గరకు తీసుకెళ్తారు. చంద్రబాబు ఇంటి దగ్గరికి తీసుకెళ్లరు. చంద్రబాబుకు ఉన్న అనుభవం డబ్బు దోచుకోవడంలో, అధికారం నిలబెట్టుకోవడంలో తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మాత్రం కాదు. సంపద సృష్టి అని రెండేళ్ల క్రితం చెప్పిన చంద్రబాబు కేవలం ఆయన కొడుక్కో, ఈనాడు కిరణ్ కో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకో సృష్టించాడు తప్ప రాష్ట్రానికి కాదు. పోలీసులు రోడ్ల మీద వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేనా సంపద సృష్టి ? చంద్రబాబు సంపద సృష్టించకపోగా, అప్పులు చేసి సంపద దోచుకునే పరిస్ధితి ఉంది. - ఏమాత్రం నైతిక విలువల్లేని చంద్రబాబు వ్యవసాయ ఉత్పత్తులు దేనికీ రేటు లేకుండా పోయిందంటే కారణం చంద్రబాబు విధానాలే. రెండేళ్లకే కనీవినీ ఎరుగని ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నారు. స్థానిక ఎన్నికల్లో పోలీసులు ఓట్లేస్తే చెప్పలేం కానీ ప్రజలు ఓటేస్తే మేమే గెలుస్తాం. పోలీసులు కాకుండా ప్రజలు ఓటేస్తే మాత్రం వైయస్ఆర్‌సీపీ అద్భుతమైన మెజార్టీతో గెలుస్తుంది. చంద్రబాబుకు ఏమాత్రం నైతిక విలువల్లేవు. ఎన్డీయేలో ఉంటూ రేవంత్ రెడ్డితో రోజూ హాట్ లైన్ లో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకం రద్దు చేసేసాడు. ఇదేనా మీ నైతికత ? మహిళా బిల్లుకు అనుకూలంగా ఓటేయడానికి వెళ్లి, అదే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన రేవంత్ రెడ్డి దగ్గర అద్భుతమైన డిన్నర్ తీసుకుని, పూలగుచ్చాలు ఇచ్చి వచ్చారు. దోచుకోవడానికి, పదవులు సంపాదించుకోవడానికి ఏ గడ్డి అయినా కరచేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉంటారని అంబటి రాంబాబు అక్షింతలు వేశారు.