వికేంద్రీక‌ర‌ణే లక్ష్య‌‌మ‌ని ఎన్నిక‌ల‌కు ముందే చెప్పాం

అమ‌రావ‌తిలో రాజ‌ధాని పెడుతున్న‌ట్లు చంద్ర‌బాబు ఓటింగ్ పెట్టారా?

అమ‌రావ‌తి అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందిన‌ట్లా? 

అమ‌రావతి టీడీపీ నేత‌ల‌కు కామ‌ధేనువు

ద‌మ్ముంటే చంద్ర‌బాబు త‌న ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాలి

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల‌కు ముందు వికేంద్రీక‌ర‌ణే ల‌క్ష్య‌మ‌ని చెప్పార‌ని,అదేచేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వికేంద్రీక‌ర‌ణ చ‌ట్టం ఏదో స‌ర‌దాగా చేసింది కాద‌ని, నిపుణుల క‌మిటీ సూచ‌న‌లు, మంత్రివ‌ర్గ ఉప సంఘం అభిప్రాయాల‌ను, రాష్ట్రంలోని మూడుప్రాంతాల ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని చేశామ‌న్నారు. ఐదేళ్లు పాలించ‌మ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు అధికారం ఇచ్చార‌ని, వికేంద్రీక‌ర‌ణ విష‌యంలో మేం చెప్పేది స‌రైంది కాద‌ని భావిస్తే..టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల్లో గెలవాల‌న్నారు. అది చేయ‌కుండా బంఫ‌ర్ ఆఫ‌ర్ అంటూ వెకిలి రాత‌లు రాస్తూ..ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని చూడ‌టం స‌రైంది కాద‌న్నారు. శ‌నివారం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధికి కృషి..

రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు వెళ్తున్నార‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చెప్పారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప‌రిగ‌ణలోకి తీసుకొని  వికేంద్రీక‌ర‌ణ చ‌ట్టం చేశామ‌న్నారు. చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమ‌రావ‌తిని ఎంచుకున్నార‌ని విమ‌ర్శించారు. గ‌త ఐదేళ్లు అమ‌రావ‌తిలో మాయ‌బ‌జార్ సినిమా చూపించార‌ని మండిప‌డ్డారు.  చేస్తున్నామ‌ని చెప్పారు. అమ‌రావ‌తి రైతుల‌ను చంద్ర‌బాబు రెచ్చ‌గొడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 

గంద‌ర‌గోళం సృష్టించేందుకు బాబు ప్ర‌య‌త్నం
రాష్ట్రంలో గంద‌ర‌గోళం సృష్టించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విమ‌ర్శించారు. చిన్న పిల్లాడు మారం చేసే స్టేజ్ దాటిపోయి అల్ల‌రి చేసి, గోల‌ చేసి, గంద‌ర‌గోళం క్రియేట్ చేయ‌డానికి ట్రై చేసిన‌ట్లుగా చంద్ర‌బాబు ఇలాంటి గంద‌ర‌గోళం చేస్తున్నారు. విశాఖ ప్ర‌జ‌లు చాలా దయాగుణం క‌లిగిన వార‌ని, వాళ్ల‌తో రాజ‌ధాని వ‌ద్ద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అది కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా జూమ్ మీడియాతో మాట్లాడుతున్నారు. నిజాల‌ను ప‌క్క‌కు తోసేసి అబ‌ద్దాల‌ను చెబుతూ..ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌యత్నం చేస్తున్నారు. వికేంద్రీక‌ర‌ణ అంటే అమ‌రావ‌తిని త‌ర‌లిస్తున్నార‌ని విష ప్ర‌చారం చేస్తున్నారు. చంద్ర‌బాబు ఉద్దేశ‌మేంటంటే విశాఖ ప్ర‌జ‌లు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని వ‌ద్ద‌ని, క‌ర్నూలు ప్ర‌జ‌లు మాకు న్యాయ రాజ‌ధాని వ‌ద్ద‌ని చెప్పించేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదేం లాజిక్కో అర్థం కావ‌డం లేదు. పిచ్చి వ‌ల్ల‌నో, మ‌తిస్థిమితం లేక మాట్లాడుతున్నారంటే అది పొర‌పాటే. చంద్ర‌బాబు న‌టిస్తున్నారు. అనుభ‌వం క‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడిగా ..ఆ స్థాయిలో వాద‌న‌లు వినిపించి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మేం అడుగుతున్నారు కాబ‌ట్టి అమ‌రావ‌తి ఇవ్వొచ్చు క‌దా?  రాజీనామాలు చేసి మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్దామంటున్నారంటే ఒక సామెత గుర్తుకు వ‌స్తుంది. చంద్ర‌బాబుకు ప్ర‌జా సంక్షేమం ప‌ట్ట‌దు. 

చంద్ర‌బాబు ఓటింగ్ పెట్టారా?
2014 ఎన్నిక‌ల‌కు ముందు తాను అమ‌రావ‌తిలో రాజ‌ధాని పెడ‌తాన‌ని చెప్పి ఓట్లు అడ‌గ‌లేదు. శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ అభిప్రాయాలు కూడా తీసుకోలేదు. వికేంద్రీక‌ర‌ణ అవ‌స‌ర‌మ‌ని కేంద్రం నియ‌మించిన శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ చెప్పింది. ప్ర‌జ‌ల తీర్పు లేదు. క‌మిటీ సిపార్స్ లేదు. మీకు మీరుగా స్వార్థం లాభం కోసం, నారాయ‌ణ క‌మిటీ వేసి అమ‌రావ‌తిలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం మొద‌లుపెట్టారు. ఆ రోజు మీరు అనౌన్స్ చేసే ముందు అక్క‌డా, ఇక్క‌డా అంటూ లీకులు ఇచ్చారు. తీరా అమ‌రావ‌తిలో రాజ‌ధాని అంటూ మీ బినామీలు భూములు కొనుగోలు చేసిన త‌రువాత ప్ర‌క‌టించారు. నిజంగా అభివృద్ధి చేయాల‌నే చిత్త‌శుద్ధి చంద్ర‌బాబులో లేదు. ఇటు అటు కాకుండా..ఎలాంటి విధి లేకుండా పంట పొలాల్లో రాజ‌ధాని రాబోతుంద‌ని మాయ‌బ‌జార్ మాదిరిగా క్రియేట్ చేశారు. అమ‌రావ‌తి విష‌యంలో ఏ తీర్పు లేదు. రెఫ‌రెండం లేదు. నాలుగేళ్ల పాటు చంద్ర‌బాబు ఏం చేశారు. ల‌క్ష‌ణంగా భ‌వ‌నాలు నిర్మించ‌వ‌ద్ద‌ని ఎవ‌ర‌న్నారు. క‌నీసం స‌గ‌మైన పూర్తి చేసి ఉంటే ఈ పాటికి కార్యాక‌లాపాలు మొద‌ల‌య్యేవి. చంద్ర‌బాబు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌కుండా ఎడారిలా చేశారు. ఆయ‌న క‌ట్టించిన తాత్కాలిక భ‌వ‌నాలు రెండు చినుకులు ప‌డితే చాలు కారిపోతుంది. ఆయ‌న చెంచాల‌కు, తాబేదారుల‌కు ఉప‌యోగ‌క‌రంగా రాజ‌ధానిని మార్చారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఉప‌యోగం క‌లుగ‌లేదు. విజ్ఞ‌త గ‌ల నేత‌గా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. 

ఎన్నిక‌ల ముందు చెప్పిందే చేస్తున్నాం..

వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఎన్నిక‌ల ముందు మేనిఫెస్టోలో పెట్టిన హామీల‌న్ని అమ‌లు చేస్తున్నారు.  వికేంద్రీక‌ర‌ణ ల‌క్ష్యంగా ఎన్నిక‌ల‌కు వెళ్లాం. పాద‌యాత్ర స‌మ‌యంలో ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో కూడా వైయ‌స్ జ‌గ‌న్ చాలా స్ప‌ష్టంగా చెప్పారు. రాజ‌ధాని కుంభ‌కోణాలపై లోతుగా అధ్యాయనం చేసుకొని, వికేంద్రీక‌ర‌ణ చేస్తామ‌ని ఆ రోజే చెప్పారు. వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా ఏడాది పాటు క‌స‌ర‌త్తు చేశారు. నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేశారు. మంత్రివ‌ర్గ ఉప‌సంఘం వేశారు. మంత్రివ‌ర్గంలో చ‌ర్చించారు. అసెంబ్లీలో గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చించి వికేంద్రీక‌ర‌ణపై రాజ్యాంగ‌బ‌ద్ధంగా చ‌ట్టం చేశారు. ఏదీ కూడా ర‌హ‌స్యంగా చేయ‌లేదు. చాలా పార‌ద‌ర్శ‌కంగా చేస్తున్నాం. ఎన్నిక‌ల్లో వికేంద్రీక‌ర‌ణ చేస్తామ‌ని చెప్పారు. అదే చేస్తున్నారు. ప్ర‌జ‌లు వైయ‌స్ఆర్‌సీపీని 51 శాతం ఓట్ల‌తో 151 సీట్లు ఇచ్చి అధికారం క‌ట్ట‌బెట్టారు. ఇదేదో స‌ర‌దాగా చేసింది కాదు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండేందుకే..మూడు ప్రాంతాల ప్ర‌జ‌ల ఆకాంక్ష మేర‌కు, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గుర్తించి మూడు రాజ‌ధానులు చేశాం. ఇక్క‌డే శాస‌న రాజ‌ధాని ఉంటుంది. విశాఖ పాల‌నా రాజ‌ధానిగా ఉంటుంది. క‌ర్నూలు న్యాయ రాజ‌ధానిగా ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలో మేమేందుకు ఎన్నిక‌ల‌కు వెళ్తాం. ఎందుకు రాజీనామాలు చేస్తాం. వేరే పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే రాజీనామా చేయాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. అలాగే చేసి గెలిచారు. ఎవ‌రైనా స‌రే ప్ర‌జ‌ల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయ‌ని తెలుసుకోవాలంటే ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాలి. రాష్ట్ర‌వ్యాప్తంగా ఐదు కోట్ల మంది వైయ‌స్ జ‌గ‌న్‌పై ఆగ్ర‌హంతో ఉన్నార‌ని, అంద‌రూ చంద్ర‌బాబు  వెంటే ఉన్నార‌ని నిరూపించాలంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాలి. చంద్ర‌బాబు త‌న ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేస్తే స్పీక‌ర్ కూడా రెడీగా ఉన్నారు. వెంట‌నే ఆమోదిస్తారు. అప్పుడు మేం పోటీ పెట్టి ఉప ఎన్నిక‌ల‌కు వ‌స్తాం. రాజీనామా చేసి గెలిస్తే చంద్ర‌బాబుకు అడిగే హ‌క్కు ఉంటుంద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బాబు బంఫ‌ర్ ఆఫ‌ర్ అంటూ వెకిలిత‌నానికి హ‌ద్దు, అదుపులేకుండా చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌ధాని రైతుల‌పై ఎక్క‌డ లేని ప్రేమ ఉన్న‌ట్లు చంద్ర‌బాబు న‌టిస్తున్నారు. అక్క‌డ నిజ‌మైన రైతులు ఎంత న‌ష్ట‌పోయార‌న్న‌ది ప‌రిశీలిస్తే..గ‌జం ల‌క్ష‌ల విలువ ప‌లుకుతుంద‌ని మ‌భ్య‌పెట్టారు. రైతుల‌పై ఒత్తిడి తెచ్చారు. చంద్ర‌బాబు నిర్ణ‌యంతో అమ‌రావ‌తి రైతులు చాలా న‌ష్ట‌పోయార‌ని స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top