వివేకానంద రెడ్డి హత్య ప్రజాస్వామ్యానికి దుర్దినం

చంద్రబాబు మానవత్వంలేని వ్యక్తి

డబ్బు,హింసతో తెలుగుదేశం రాజకీయాలు..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచముల్లు శివప్రసాద్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: ఎన్నికలు 25 రోజులు ఉండగా వైయస్‌ఆర్‌సీపీకి చెందిన బలమైన నాయకుడు వైయస్‌ వివేకానంద రెడ్డిని హతమార్చడం ప్రజాస్వామ్యానికి దుర్దినం అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచముల్లు శివప్రసాద్‌ రెడ్డి అన్నారు.ఇడుపులపాయలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హింస వాదులందరూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.డబ్బుతోనూ, హింసతోనూ మళ్లీ అధికారంలోకి రావడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు.ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు.అత్యంత సౌమ్యుడు, వివాదరహితుడు, చీమకైనా హాని చేయని వైయస్‌ వివేకానందరెడ్డిని టీడీపీ ఏ కారణ చేత హత్య చేయిందని ఆలోచన చేస్తే.. జరగబోయే ఎన్నికల్లో జమ్మలమడుగు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించి,రామసుబ్బారెడ్డిని ఓడించడానికి కీలకపాత్ర పోషిస్తారు అనే ఉద్దేశ్యంతో చంద్రబాబు సూత్రధారిగా,ఆదినారాయణ రెడ్డి పాత్రధారులుగా కిరాయి హంతుకులచే హత్య చేయించారనేది  నిజమన్నారు.చంద్రబాబు మానవత్వం లేకుండా వైయస్‌ఆర్‌సీపీపైనే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.మానవత్వం లేని అత్యంత కిరాతక మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top