అగ్రిగోల్డు బాధితులకు వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చారు

వైయస్‌ఆర్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి

గత ప్రభుత్వం అగ్రిగోల్డు బాధితులను పట్టించుకోలేదు

బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడం హర్షనీయం

అగ్రిగోల్డు ఆస్తులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది

తాడేపల్లి: అగ్రిగోల్డు బాధితులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ చైర్మన్‌ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అగ్రిగోల్డు బాధితుల బాధలను గాలికొదిలేసిందని, ఆస్తులను కాజేసే కుట్రలు చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో వారిని ఆదుకుంటామని మాట ఇచ్చిన వైయస్‌ జగన్‌ మొదటి కేబినెట్‌ సమావేశంలోనే తీర్మానం చేశారని, అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారని తెలిపారు. ఇచ్చిన మాట మేరకు అగ్రిగోల్డు బాధితులను ఆదుకునేందుకు నిధులు కేటాయించారని తెలిపారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి బాధితుల తరఫున లేళ్ల అప్పిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రరాష్ట్రంలో అగ్రిగోల్డు బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ రూ.1150 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారని, ఇందులో రూ.20 వేల లోపు చెల్లించిన బాధితులను ఆదుకునేందుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో అగ్రిగోల్డు బాధితులను ఆదుకుంటామని వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మూడు నెలల కాలంలోనే నెరవేరిందన్నారు. కేబినెట్లో, అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే అగ్రిగోల్డు బాధితులను ఆదుకుంటామని పేర్కొన్నారు. అగ్రిగోల్డు బాధితులకు మొదటి విడతగా 3, 69,655 మంది రూ.10 వేల లోపు బాధితులకు రూ.263.99 కోట్లను  విడుదత చేశారన్నారు. దేశంలో అనేక చోట్ల అనేక కుంభకోణాలు జరిగాయని, ఎక్కడా కూడా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడం చూడలేదన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, 14 ఏళ్లు సీఎంగా అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అగ్రిగోల్డు బాధితులు పోరాటం చేసినా ఏ నాడు కూడా ఆదుకునే ఆలోచన చేయలేదన్నారు.

అగ్రిగోల్డు యాజమాన్యంతో కుమ్మక్కై వారి ఆస్తులు కాజేసే ఆలోచన చేశారన్నారు. పరిపాలన చేయడానికి రాజకీయ అనుభవం అవసరం లేదని, బాధితులను ఆదుకోవాలనే ఆలోచన వైయస్‌ జగన్‌కు ఉందన్నారు. అగ్రిగోల్డు బాధితులు ఏ ఒక్కరూ కూడా ఆత్మహత్య చేసుకోకూడదని ఆలోచన కలిగిన వ్యక్తిగా, మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వమని వైయస్‌ జగన్‌ నిరూపించారు. నవరత్నాలతో పాటు అగ్రిగోల్డు బాధితులను ఆదుకోవడం పది రత్నాల పథకాలుగా అభివర్ణించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీరును అందరూ హర్షిస్తున్నారని చెప్పారు. అగ్రిగోల్డు బాధితులుగా సన్న, చిన్నకారు రైతులు, కూలీలు, కార్మికులు ఉన్నారని, ఇలాంటి వారిని ఆదుకోవాలని తాను కూడా పోరాటం చేసినట్లు చెప్పారు.

ఇవాళ గర్వంగా చెబుతున్నానని, వైయస్‌ జగన్‌ నేతృత్వంలో బాధితులకు అండగా నిలిచామన్నారు.  వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని వైయస్‌ జగన్‌ నెరవేర్చుతున్నారని తెలిపారు. రూ.10 వేల లోపు చెల్లించిన బాధితులకు వారి ఖాతాల్లో డబ్బులు జమా చేసే కార్యక్రమాలు మొదలుపెట్టామని చెప్పారు. రూ.20 వేల లోపు కట్టిన ప్రతి బాధితుడిని కూడా ఆదుకునే కార్యక్రమం చేపట్టామన్నారు. వారిని కూడా గుర్తించే కార్యక్రమాలు మొదలుపెట్టామన్నారు. డిపాజిట్‌దారులందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటామన్నారు.

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్కరూ కూడా ధర్నాలు, దీక్షలు చేయలేదన్నారు. ఎవరూ అడగకుండానే, వైయస్‌ జగన్‌ బాధితుల పక్షాన నిలబడి నిధులు కేటాయించారన్నారు. చంద్రబాబు హయాంలో కమిటీల పేరుతో కాలయాపన చేశారన్నారు. టీడీపీ హయాంలో అగ్రిగోల్డు ఆస్తులను అప్పన్నంగా దోచుకున్నారని, ఎంతటి వారైనా సరే అందరిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకుంటుందని , బాధితులు ఎవరూ కూడా అధైర్యపడొద్దని సూచించారు. బాధితులందరూ కూడా వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్లేక్సీలకు పాలాభిషేకం చేస్తున్నారని తెలిపారు. బాధితుల పక్షాన వైయస్‌ జగన్‌కు, ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.  

Read Also: అగ్రిగోల్డ్ బాధితుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన హామీని నెర‌వేర్చారు

తాజా వీడియోలు

Back to Top