నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి

విద్యాశాఖ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

వైయస్‌ఆర్‌ జిల్లా: పాఠశాలలు, కళాశాలల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులకు సూచించారు. కడపలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మన బడి, నాడు – నేడు కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. విద్యాశాఖకు సీఎం వైయస్‌ జగన్‌ రూ. 33 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. అమ్మ ఒడి, మనబడి నాడు – నేడు వంటి వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాలలను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. 

Read Also: వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై కొనసాగుతున్న దాడులు​

Back to Top