సూరి హింసా రాజకీయాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
 

అనంతపురం: ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి హింసా రాజకీయాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వైయస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్‌ తరువాత సూరి హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను చంపాలని కార్యకర్తలకు సూరి దిశానిర్దేశం చేశారని, అందుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు కూడా సూరి వాయిస్‌ స్పష్టంగా ఉందని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే సూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన ఆస్తుల విధ్వంసం, భౌతిక దాడుల కేసుల్లో సూరిని నిందితుడిగా చేర్చాలని ఆయన డిమాండు చేశారు.
 

Back to Top