‘కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది’ 

మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫైర్‌

ఎన్టీఆర్ జిల్లా:  ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పతనం మొదలైందన్నారు మైలవరం నియోజవర్గ వైయ‌స్ఆర్‌సీపీ  సమన్వయకర్త, మాజీ మంత్రి జోగి రమేష్. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వివరించడానికే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 4వ తేదీన వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఈరోజు(ఆదివారం) పోస్టర్ ను ఆవిష్కరించారు జోగి రమేష్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వ చేసిన మోసాల్ని ప్రజల సమక్షంలో ఎండగడతాం,  మైలవరం నియోజకవర్గంలో  జూన్ 04 న  జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. 

జూన్4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇచ్చిన హామీలన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది.  జూన్ 04 న మైలవరం డాక్టర్ లక్కిరెడ్డి హనిమి రెడ్డి కాంప్లెక్స్ వద్ద నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీని జరుగనుంది’ అని జోగి రమేష్ తెలిపారు. 

Back to Top