సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం చారిత్రాత్మకం

రాజ్యాంగ సంస్థల వికేంద్రీకరణ చాలా మంచిది

అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే టీడీపీ అభ్యంతరం ఏంటి?

ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

ఇతర రాష్ట్రాలకు కూడా సీఎం వైయస్ జగన్‌ నిర్ణయం ఆదర్శం

అభివృద్ధిపై టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదు

చంద్రబాబుకు ఎలాంటి విజన్‌ లేదు

చంద్రబాబులా కాకుండా పవన్‌ సొంతంగా ఆలోచించాలి

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు దాడి వీరభద్రరావు

వైజాగ్‌: రాజ్యాంగ వ్యవస్థ వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. విశాఖలో సచివాలయం, డైరెక్టరేట్‌, అమరావతిలో చట్ట సభలు, రాయలసీమలో న్యాయవ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం వైయస్‌ జగన్‌ నిన్న అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. బుధవారం దాడి వీరభద్రరావు విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

ఆఫ్రికా, ఇతర దేశాల్లో కూడా మూడు, నాలుగు ప్రాంతాల్లో రాజధాని విస్తరించారు. ఇక్కడ కూడా ఆ అవకాశం ఉందని శాసన సభలో సీఎం వైయస్‌ జగన్‌ చేసిన ప్రకటనను ఉత్తరాంధ్ర ప్రజల తరఫున స్వాగతిస్తున్నాం. ఇంకా విశాఖ పట్నం, కర్నూలులో రాజధాని పెట్టకూడదని చంద్రబాబు  వెనుక ఉత్తరాంధ్ర, ఈస్టుగోదావరి, వెస్టు గోదావరి నాయకులనకు చెబుతున్నాను. దయచేసి బానిస బతుకులు బతకవద్దు. చంద్రబాబు ఏమి చెబితే దానికి తానా అంటే తందాన అనకండి. మీకు స్వాతంత్ర్యం లేదా? . మా ప్రాంతాలను వైయస్‌ జగన్‌ అభివృద్ధి చేస్తామంటున్నారని, దాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్రంలో వికేంద్రికరణ జరగాలని, వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని బలపరద్దామని ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఎన్‌టీ రామారావు కాలం నుంచి టీడీపీలో ఉన్నామని చెప్పుకునే నాయకులు చంద్రబాబు వద్ద బానిస బతుకులు బతుకున్నారు. మీరేం నాయకులు. విశాఖలో సచివాలయం వస్తుందంటే వ్యతిరేకిస్తున్న మిమ్మల్ని ఏమనాలి.విశాఖలో మీకు పుట్టగతులుండవ్‌. మనం ఊహించని రీతిలో సెక్రటరీయట్‌, డైరెక్టరేట్‌ను  ఇక్కడ ఏర్పాటు చేస్తామంటే అందరం స్వాగతించాలి. ప్రజలందరూ ఇదే కోరుతున్నారు. విశాఖ జిల్లా చాలాకాలం నుంచి వెనుకబడింది. దీన్ని అభివృద్ధి చేసేందుకు వైయస్‌ జగన్‌ ఒక ఆశయంతో ముందుకు వస్తున్నారు. వికేంద్రీకరణను అందరూ స్వాగతిస్తున్నారు. దీనికి దమ్ముండాలి. సహసం ఉన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. నిన్న అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటన రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.నిజానికి ఇది అధికార వికేంద్రీకరణ కాదు..పాలనా వికేంద్రీకరణ కాదు.. ఇది వ్యవస్థల వికేంద్రీకరణ. మూడు రాజ్యాంగ వ్యవస్థలను ఒకే చోట ఉంచే విధానానికి స్వస్థి చెప్పి..మూడు వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో పెట్టాలని సీఎం సహసోపేతమైన నిర్ణయం. ఇక్కడే కాకుండా ఇతర దేశాల్లో కూడా రాజధానులు మూడు, నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మన దేశంలో కూడా  ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. రాజధాని, హైకోర్టు వేరే వేరు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, కేరళ, ఒడిశా, చత్తీష్‌గడ్‌, ఉత్తరాఖండ్‌, మిజోరాం, లక్ష్యదీప్‌, గోవా,నాగాలాండ్‌ రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట ఉంటే మరోచోటా హైకోర్టు ఏర్పాటు చేశారు. వ్యవస్థల వికేంద్రీకరణ ఈ రాష్ట్రాల్లో చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు వ్యవస్థలు వికేంద్రీకరణ చేయలేదు. వైయస్‌ జగన్‌ తీసుకుబోయే నిర్ణయం చట్ట సభలు ఒక చోట, సెక్రటేరియట్‌ మరోచోటా, న్యాయస్థానం మరోచోటా ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటిది దేశంలో మొట్ట మొదట ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారు. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం.
40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు..ఇన్ని రాష్ట్రాల్లో హైకోర్టు, రాజధాని మరో చోట ఉన్నాయి. హైకోర్టు బెంచీలు కూడా వేరు వేరుగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కలిసి ఉన్న రోజుల్లో కూడా చంద్రబాబు హైకోర్టు బెంచీని ఏపీలో చేర్పాటు చేయలేదు. 20,20 విజన్‌ అంటారే తప్ప..ఆయనకు విజనే లేదు. అన్ని వ్యవస్థలు ఒకే చోట కేంద్రీకరించడం వల్ల కొన్ని ప్రాంతాలు వెనుకబడతాయి. ఈ వెనుకబడిన  ప్రాంతాల ప్రజలు పోరాటాలు చేసి తమ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని దుగ్ధతో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమిస్తున్నారు.ఇప్పటికీ కూడా సుమారు పది రాష్ట్రాల ప్రజలు రాజధానికి దూరంగా ఉన్నామని ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారు. ఇలాంటి సమస్యకు వైయస్‌ జగన్‌ పరిష్కారమార్గం చూపారు. రాజ్యాంగ వ్యవస్థలను వికేంద్రీకరిస్తే అలాంటి డిమాండు ఎక్కడా రాదు. మన రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం ఒక దిక్సూచిగా ఇతర రాష్ట్రాలకు ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా భవిష్యత్‌లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అమరావతి గురించి చంద్రబాబు ఘోరంగా మాట్లాడుతున్నారు. అమ్మ కంటే అమరావతి గొప్ప అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అ అంటే అమ్మ కాదు..అమరావతి అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆయనకు అమ్మ కంటే అమరావతి గొప్ప కావచ్చు..కానీ రాష్ట్ర ప్రజలకు కాదు..అమ్మ తరువాతే అన్నీ..ఆ సెంటిమెంట్‌ కూడా లేని వ్యక్తి చంద్రబాబు. చిన్న పిల్లలకు కూడా అఆలు దిద్దే క్రమంలో కూడా చంద్రబాబు అమ్మ పేరు బదులు అమరావతి అని రాయించాడు. అమరావతి ఇప్పుడు పెట్టింది కాదు..అమరావతిలో కూడా ఒక వ్యవస్థ ఉంది. విశాఖ, కర్నూలులో వ్యవస్థలు ఉండకూడదట. ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదు..ఎన్నికలకు ముందు చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన నేతలను పిలిచిపించుకొని మీ అందరు తనకు మద్దతు ఇవ్వాలని, మీకు ఏం కావాలో చెప్పండి అంటూ గత ఎన్నికల్లో అందరితో చర్చించారు. ఎన్నికల్లో గెలిస్తే..అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టాలని, మిమ్మల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటామని ఆయన సామాజిక వర్గం నేతలు చెప్పారు. ఆ కండీషన్‌తోనే ముందుగానే ఈ ప్రాంతంలో రాజధాని పెట్టాలని ఫిక్స్‌ అయ్యారు. ముందేమో గుంటూరు, నూజీవీడు అంటూ సలహాలు ప్రజలకు ఇస్తూ..తన మనుషులకు మాత్రం ఆయన సామాజిక వర్గం చూపించిన అమరావతిలో రాజధాని పెట్టారు. తన సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రామీస్‌లను నెరవేర్చలేకపోతున్నానని చంద్రబాబు ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా మాట్లాడుతున్నారే తప్ప..ఒక రాజకీయ నాయకుడిలా వ్యవహరించడం లేదు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష హోదాలో మాట్లాడటం లేదు. ఆయన సిగ్గు పడటం లేదు. దేశంలో సిగ్గుపడని నేత చంద్రబాబు ఒక్కరే. ప్రజలకు షార్ట్‌ మెమోరీ కాబట్టి వారికి జ్ఞాపకం ఉండదని ఆయన పూటకో అబద్ధం ఆడుతుంటారు. రైతుల నుంచి తీసుకున్న రాజధాని భూములు తన వారందరికీ కూడా కట్టబెట్టారు. రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ సంస్థకు ఉచితంగా భూములు ఇవ్వడానికి బదులుగా ఎకరా రూ.4 కోట్లకు ఇచ్చిన చంద్రబాబు..తన మనుషులకు మాత్రం ఎకరా రూ.1 లక్ష, రెండు లక్షల చొప్పున ధారాదత్తం చేశారు. కేంద్ర సంస్థలకు భారీ మొత్తంలో భూములు అమ్మి,  తన మనుషులకు ధారాదత్తం చేశారు. చుట్టుపక్కల ఉన్న భూములను తన వారికి కొనుగోలు చేయించారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ ద్వారా సుమారు 4 వేల ఎకరాలను కొనుగోలు చేయించారు. ఇవన్నీ కూడా చంద్రబాబు విజన్‌లోని విషయాలు.
మూడు రాజధానులు  పెడుతున్నారు..ముఖ్యమంత్రి ఎక్కడుంటారని చంద్రబాబు అడుగుతున్నారు. సీఎం ఎక్కడుంటారో కూడా తెలియని మాజీ ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబును మాత్రమే చూస్తున్నాం. సీఎం ఎక్కడుంటారో తెలియదా? మీరు సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడుండేవారు. హైకోర్టుకు ముఖ్యమంత్రి హాజరవుతారా? చంద్రబాబు వాదన తెలివి తక్కువ కాక మరేంటి? హైకోర్టు వద్ద సీఎం నివాసం కట్టుకుంటారా?. సమావేశాలప్పుడు మాత్రమే అసెంబ్లీ ప్రాంతంలో సీఎం ఉంటారు. పరిపాలన ఎక్కడ నుండి కొనసాగిస్తారో..సెక్రటేరియట్‌, డైరెక్టేట్స్‌ ఎక్కడుంటాయో అక్కడి నుంచే సీఎం పరిపాలన జరుగుతుంది. విశాఖపట్నం సెక్రటేరియట్‌ కాబోతుందంటే..సీఎం వైయస్‌ జగన్‌ ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తారు.ఆ మాత్రం కూడా చంద్రబాబుకు తెలియదా? ఇంగితజ్ఞానం కూడా చంద్రబాబుకు లేదా? తెలుసుకుని మాట్లాడాలి. 
విశాఖపట్నాన్ని నాశనం చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. విశాఖను రాజధానిగా చేస్తుంటే చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్రమీద ఇంత కక్ష్యా? ఓట్లు కావాల్సిన పెద్ద మనిషి, రాజకీయ పార్టీ నడిపే పెద్ద మనిషి ఒక ప్రాంతంపై ఇంత అసుయాతో వ్యతిరేకించడం దారుణం. 
చంద్రబాబుకు పవన్‌ కళ్యాణ్‌ వంత పాడుతున్నారు. ఆయన అంటున్నారు..ఒక రాజధాని కట్టలేని వారు మూడు రాజధానులు ఎలా కడుతారని ప్రశ్నిస్తున్నారు.పవన్‌..ఈ ప్రశ్న మీ బాస్‌ అయిన చంద్రబాబును అడగండి. గత ఐదేళ్లు రాజధానిని ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించండి.  ఇప్పుడు కడతారా? లేదా అన్నది మమ్మల్ని అడగండి. చంద్రబాబును అడగాల్సిన ప్రశ్నలు వైయస్‌ జగన్‌ను వేయడం సరికాదు. ఇటువైపు కూడా చిరంజీవి, పవన్‌కు ఫ్యాన్స్‌ ఉన్నారు. వీరందరూ కూడా రాజకీయాల్లో పవన్‌ను పక్కన పెట్టారు. చలనచిత్ర పరిశ్రమలో మంచి కలెక్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు అడుగు జాడల్లో పవన్‌ వెళ్లడం సరికాదు. పవన్‌ మీ విధానాలు మార్చుకోవాలి. మీకంటూ కొంత ఆలోచన చేయండి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే ఆలోచనను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే..ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు. చంద్రబాబు దారిలో వెళ్తే..మీకు అదే గతి పడుతుంది. రాజధానిపై ఏర్పాటు చేసిన కమిటీ వారం పది రోజుల్లో తమ నివేదికను అందజేస్తుంది. తప్పనిసరిగా వైయస్‌ జగన్‌ తన తాలుకా ఆలోచనను అసెంబ్లీలో చెప్పడం సంతోషం. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చంద్రబాబు విశాఖలో చేసిన అభివృద్ధి ఏమిటి. ఏ నాడు కూడా రాజ్యాంగ వ్యవస్థను గౌరవించలేదు.  ఆన్‌లైన్‌ విధానాన్ని రెవెన్యూలో ప్రవేశపెట్టి..మీరు, మీ మందిమగదులు వేలాది ఎకరాలను స్వాహా చేసింది వాస్తవం కాదా? మీ మనుషులందరిని రిచ్చేస్ట్‌ మనుషులుగా మార్చి..రైతులను నడి వీధిలో పెట్టారు. 22ఏ వెబ్‌సైట్లో పెట్టించి రైతులను ఇబ్బందుల పాలు చేశారు. ప్రభుత్వ భూములను తన వారికి కట్టబెట్టిన స్వార్థపరుడు చంద్రబాబు. విశాఖలో రూ.20 వేల కోట్లు పోర్టును అభివృద్ధి చేసేందుకు ఇస్తే..ఆ రోజు విశాఖ పోర్టుకు అనుమతి ఇవ్వకుండా, గంగవరం పోర్టు అనే ప్రైవేట్‌ పోర్టుకు అనుమతి ఇచ్చింది మీరు కాదా చంద్రబాబు. కమీషన్లకు లొంగిపోయి విశాఖపోర్టు విస్తరణ లేకుండా చేశారు. దుగ్గిరాజుపట్నం, రామయ్యపట్నం, నక్కపల్లి మూడు ప్రాంతాలను వైయస్‌ఆర్‌ హయాంలో ప్రతిపాదనలు ఇస్తే..చంద్రబాబు పట్టించుకోలేదు. అది మాకు జరిగిన నష్టం కాదా? ఎయిర్‌ ఇండియా కాంట్రాక్ట్‌ తీసుకొని నిర్మిస్తామంటే ఆ రోజు ఆపింది మీరు కాదా? విశాఖకు చంద్రబాబు చేసిన అన్యాయాలు ఇన్నీ అన్నీ కావు.
అసెంబ్లీలో చంద్రబాబు వెన‌క్కి నడుస్తూ నిరసన తెలపడం సిగ్గుచేటు. పిచ్చి తుగ్లక్‌ చంద్రబాబే..వెనక్కి నడిచే విధానం చంద్రబాబుదే. రివర్స్‌ వాకింగ్‌ చేస్తూ పాదయాత్ర చేస్తే చంద్రబాబును అందరూ చూస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు విఫలమయ్యారు. వైయస్‌ఆర్‌ కుమారుడు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవడంతో చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. వైయస్‌ జగన్‌ తీసుకున్న వ్యవస్థల వికేంద్రీకరణను అందరూ స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వైయస్‌ జగన్‌ తన అభిష్టానాన్ని ఆచరించాలని కోరుతున్నాను. విశాఖలో ఆల్‌రెడీ కొన్ని భవనాలు ఉన్నాయి..అంటున్నారు. 2020లోనే వికేంద్రీకరణ కార్యక్రమం అమలు పరుస్తారు. 2020లోనే సెక్రటేరియట్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తారని ఆశగా ఉన్నాం. ఆయన ఆలోచనను స్వాగతిస్తూ..సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top