వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆంక్ష‌ల‌తో అడ్డుకోవాల‌ని చూడడాన్ని ఎవ‌రూ హ‌ర్షించ‌రు

కూట‌మి స‌ర్కార్ తీరును ఎక్స్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ప‌ల్నాడు జిల్లా ప‌ర్య‌ట‌న‌ను కూట‌మి ప్ర‌భుత్వం ఆంక్ష‌ల‌తో అడ్డుకోవ‌డాన్ని ఎవ‌రూ హ‌ర్షించ‌రు అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మండిప‌డ్డారు. వైయ‌స్ జగన్ ఇవాళ‌ పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా.. ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైయ‌స్‌ జగన్‌ పర్యటనపై పోలీసులు సాయంతో కూటమి సర్కార్‌ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది.   వైయ‌స్‌ జగన్‌ పర్యటనకు కేవలం వంద మంది మాత్రమే రావాలంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, నిరసన, ధర్నా కాకపోయినా ఇలా.. పోలీసుల ఆంక్షలు విధించడంపై పార్టీ నేత‌లు ఎక్స్ వేదిక‌గా  స‌ర్కార్ తీరును ఎండ‌గ‌ట్టారు. వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే స్వేచ్చ కూడా లేదా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ద్వారా వైయ‌స్‌ జగన్‌ పర్యటనను కూటమి సర్కార్‌ నియంత్రించే కుట్రలు చేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఎక్స్ వేదిక‌గా పార్టీ నాయ‌కులు ఏమ‌న్నారంటే..

అధికారం శాశ్వ‌తం కాదు: బాల‌సాని కిర‌ణ్‌కుమార్ 
`కూటమి ప్రభుత్వం వేధింపులకు తాళ‌లేక  ఆత్మ‌హ‌త్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తున్న వైయ‌స్ జ‌గ‌న్ గారిని ఆంక్ష‌ల‌తో అడ్డుకోవాల‌ని చూడడాన్ని ఎవ‌రూ హ‌ర్షించ‌రు చంద్ర‌బాబు గారూ. ఇప్ప‌టికైనా కుట్ర‌లు చేయ‌డం ఆపండి. అధికారం శాశ్వ‌తం కాద‌న్న విష‌యాన్ని గుర్తు  పెట్టుకోండి.కూటమి ప్రభుత్వం వేధింపులకు తాళ‌లేక  ఆత్మ‌హ‌త్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తున్న వైయ‌స్ జ‌గ‌న్ గారిని ఆంక్ష‌ల‌తో అడ్డుకోవాల‌ని చూడడాన్ని ఎవ‌రూ హ‌ర్షించ‌రు చంద్ర‌బాబు గారూ. ఇప్ప‌టికైనా కుట్ర‌లు చేయ‌డం ఆపండి. అధికారం శాశ్వ‌తం కాద‌న్న విష‌యాన్ని గుర్తు  పెట్టుకోండి`.

ఇది ప్ర‌జాస్వామ్య‌మా?  రాక్ష‌స రాజ్య‌మా?:  దేవ‌భ‌క్తుని చ‌క్ర‌వ‌ర్తి 
`ప‌ల్నాడు జిల్లా రెంట‌పాళ్ల‌కు వెళ్తున్న  వైయ‌స్ జ‌గ‌న్ గారి  అడ్డుకోవాల‌ని కుట్ర‌లు చేయ‌డం ఏంటి చంద్ర‌బాబు
 గారూ?.  కూటమి ప్రభుత్వం వేధింపులకు తాళ‌లేక  ఆత్మ‌హ‌త్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వైయ‌స్‌ జ‌గ‌న్ గారు వెళ్తుంటే కొద్ది మంది మాత్ర‌మే వెళ్లాల‌ని ఆంక్ష‌లు ఏంటి? ఇది ప్ర‌జా స్వామ్య‌మా?  రాక్ష‌స రాజ్య‌మా?`

అడ్డుకోవాల‌ని చూడ‌డం మీ అవివేకం: కైలే అనిల్‌కుమార్‌
`కూటమి ప్రభుత్వ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని మా నాయకుడు వైయస్ జగన్ గారు వెళ్తుంటే అడుగడుగునా ఆంక్షలు పెట్టి, అడ్డంకులు సృష్టించ‌డం మీకే చెల్లింది @ncbn గారూజ‌నాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని ఇలా పోలీసు యంత్రాంగాన్ని పెట్టి అడ్డుకోవాల‌ని చూడ‌డం మీ అవివేకం. జ‌గ‌న్ గారు జ‌నం గుండెల్లో ఉన్నారు. అక్క‌డి నుంచి ఎవ‌రూ తీయ‌లేరు`

ఆంక్ష‌లు పెట్ట‌డం క‌రెక్టా? : దొంతిరెడ్డి వేమారెడ్డి

`చంద్ర‌బాబు గారూ, కూటమి ప్రభుత్వం వేధింపులు తాళ‌లేక  ఆత్మ‌హ‌త్య చేసుకున్న మా కార్య‌క‌ర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి మా నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ గారు వెళ్తుంటే ఆంక్ష‌లు పెట్ట‌డం క‌రెక్టా?  మూడు వాహ‌నాల్లోనే వెళ్లాలి, 100 మందికే అనుమ‌తి ఇస్తాం అన‌డం ఏంటి?  ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని ఇలా అడ్డుకుంటారా? ఇది ఏ మాత్రం మంచి ప‌ద్ధ‌తి కాదు  చంద్ర‌బాబుగారూ`.

Back to Top