చంద్రబాబును ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం

బాబు సూచన మేరకే బీజేపీలోకి చేరుతున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య

 

వైయస్‌ఆర్‌ జిల్లా: ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఎన్నో కుట్రలు,కుయుక్తులు చేశారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య అన్నారు.అదే తరహాలో తన ప్రభుత్వ అవినీతి,అక్రమాలు బయట పడకుండా ఉండేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు.అందుకే తన పార్టీ వారిని బీజేపీలో చేరాలని పరోక్ష సూచన చేస్తున్నారన్నారు.ఇతర పార్టీ ఎంపీలను చేర్చుకునేవారిపై మోదీ పునరాలోచించాలన్నారు.పార్టీలో చేర్చుకునే ముందు పదవులకు రాజీనామా చేసి రావాలని మోదీ వారికి సూచించాలన్నారు.బాబు లాంటి వారిని ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top