చంద్రబాబు మోసాలపై కాంగ్రెస్,జనసేన స్పందించాలి...

వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు...

విజయవాడ: చంద్రబాబు మరోసారి మోసం చేసే యత్నం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు.గత హామీలను నెరవేర్చని చంద్రబాబు..ఇప్పుడు మళ్లీ హామీలిస్తున్నారన్నారు.కులానికో హామీ ఇచ్చి తుంగలో తొక్కారన్నారు.ఈబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇస్తామంటున్నారని, కాపులను మరోసారి మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నారన్నారు.కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు.చంద్రబాబు మోసాలపై కాంగ్రెస్,జనసేన స్పందించాలన్నారు.ఎవరు కనబడితే వారితో చంద్రబాబు పొత్తుకు సిద్ధపడుతున్నారన్నారు.చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేవారు మునిగిపోవడం ఖాయమన్నారు.

అంబటి రాంబాబు ప్రెస్‌మీట్ పూర్తి వివ‌రాలు ఇలా..
-తెలుగుదేశం అధినేత చంద్రబాబు మోసాలకు తెరతీస్తుంటారు.గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చరు గాని 
కొత్తగా అనేక హామీలు ఇస్తున్నారు.
రానున్న మూడు నెలల్లో జిమ్మిక్కులు చేస్తారు.ఈ జిమ్మిక్కులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
-గాండ్ల కులాన్ని బిసి బి నుంచి ఎస్సీలుగాను, సగర్లను బిసిడి నుంచి బిసి ఏ గా మారుస్తామని, కురుబ, కురుమ కులాల్ని బిసిబి నుంచి  ఎస్టీలలో చేరుస్తామని హామీ ఇచ్చారు.వాల్మికి బోయలకు పద్మశాలీలలకు మరికొన్ని హామీలు ఇచ్చారు.
-ఈ విధంగా హామీలు ఇచ్చి వారిని ఆకర్షించి వారి ఓట్లు కాజేసే విధంగా మభ్యపుచ్చారు.
-కాపులను బిసిలలో చేరుస్తామని ఇందుకోసం మంజునాధ కమీషన్ ను నియమించారు.దానిని భ్రష్టు పట్టించారు.
-బిసి కమీషన్ నివేదిక రాకుండానే దానిని ఆమోదించేశారు.బిసి ఎఫ్ లుగా కాపులను చేసేశామని చంద్రబాబు ప్రకటించారు.
-మరి బిసిలలో కాపులను చేర్చారా లేదా అనేది చంద్రబాబు చెప్పాలి.
-ఇదంతా ఇలా ఉంటే కేంద్రం ఇటీవల అగ్రవర్ణాలలోని పేదలకోసం రిజర్వేషన్ లను ప్రకటించింది.
-ఉభయసభలలో పెట్టి రాజ్యాంగసవరణ చేసి దానిని ఆమోదించారు.
-ఆర్దికంగా సరైన స్దితిలో లేనివారికి వీటిని వర్తింపచేయాలని ప్రకటించింది.
-చంద్రబాబు ఈబిసిలకు ఇచ్చిన రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం అంటూ ప్రకటించారు.
-ఆ ప్రకటన చూస్తే చంద్రబాబు చదువుకున్నాడో లేదో అసలు అవగాహన ఉందో లేదో అర్దం కాలేదు.
-ఈ ప్రకటన చూస్తే అది అర్దం అయి కూడా కాపులను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నినట్లుగా ఉంది.
-ఈ నిర్ణయం ప్రకారం ఐదుశాతం ఇస్తానంటే మాకు సంతోషమే.చంద్రబాబు నిన్న ఘీంకరిస్తున్నాడు మేం ఇస్తామంటే వైయస్సార్ కాంగ్రెస్ వద్దంటోంది అంటూ దుష్ప్రచారం ప్రారంభించారు.
-ఆ రిజ్వరేషన్లు కాపులకు చెల్లవని తెలిసి వక్రీకరించి ఆ ప్రకటన చేశారు.
-ఎన్నికలు వచ్చేసరికి మరో మోసానికి తెరతీశారు.
-కాపులకు పంగనామాలు పెట్టాలని చూస్తున్నారు.
-గతంలో కాపులను బిసిలలో చేరుస్తామని చెప్పి వారు బిసి ఎఫ్ అని ప్రకటించి స్వీట్లు పంచారు.సంబరాలు జరుపుకోమని
కాపులకు చెప్పారు.నోటిలో స్వీట్లు పెట్టి చెవిలో పూలు పెట్టావు.
-ఆ బిసి ఎఫ్ ఫలాలు మాకు అందడం లేదని కాపులు ప్రశ్నిస్తే చంద్రబాబు సరైన సమాధానం చెప్పలేదు.
-చంద్రబాబు మంత్రులందరూ గంగిరెద్దులుగా తలలూపారు.మరిఇప్పుడు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో కాపులకు మరో ఐదుశాతం అని ఎలా చెప్పగలగావు.
- నీవు గతంలో ఇచ్చిన  కాపులను బిసి ఎఫ్ అని ఇచ్చింది మోసం అని బయటపడిపోయింది.ఇదంతా నీవు చేసిన మోసం కాదా?దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుది.
ఈ రాష్ర్టానికి మరోసారి ముఖ్యమంత్రి అవుదామనే దుగ్ద తప్ప మరోటి ఉందా?
-కానిస్టేబుల్ ను కూడా ట్రాన్స్ ఫర్ చేయలేని ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చావు.కానిస్టేబుల్ ను బదిలీ చేయాలంటే లోకేష్ ను అడగాల్సిన దుస్దితిలోకి తెచ్చావు.
-2014 ఎన్నికల సమయంలో అధికారం కోసం కులానికో హామీ ఇచ్చారు.కాపులను బిసిలలో చేరుస్తామని హామీ ఇచ్చారు.
-అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు.కేంద్రాన్ని ఇటీవల ప్రశ్నిస్తే కాపులకు సంభందించి 
ఎటువంటి వినతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందలేదని చెప్పారు
-అన్ని రాజకీయపార్టీలను కోరుతున్నాను ఆయా పార్టీలు కాపులకు రిజర్వేషన్లపై మీ అబిప్రాయాలు చెప్పాలి..
-చంద్రబాబు వైఖరిపై జనసేన,కాంగ్రెస్ లు తమ వైఖరి చెప్పాలి.
-చంద్రబాబు మోసాలను కాపులు చూస్తూ ఊరుకోరు.
-చంద్రబాబు ఒక్క కాపులనే కాదు బిసి కులాలను సైతం మోసం చేశావు.

Back to Top