ఎక్సైజ్ శాఖ డీసీ వచ్చేవరకు కదిలే ప్ర‌స‌క్తే లేదు

నకిలీ మద్యంపై అనంతపురంలో వైయ‌స్ఆర్‌సీపీ రణభేరి

అనంతపురం:  నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమాలా మార్చి, దానిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి.. కూటమి ప్రభుత్వం మద్యం విధానాలకు వ్యతిరేకంగా అనంతపురం నగరంలో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేప‌ట్టారు. వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయం నుంచి  పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. నగరంలోని ప్రకాష్‌రోడ్డులో ఉన్న ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం వద్దకు ర్యాలీగా చేరుకుని ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భిష్మించారు.

Back to Top