కల్తీ మద్యంపై క‌ర్నూలులో పోరుబాట‌

క‌ర్నూలు:  కల్తీ మద్యంపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో పోరుబాట ప‌ట్టారు. నకిలీ మద్యంతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలను బలిపీఠం మీదకు నెట్టటంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం చేస్తూ సోమ‌వారం జిల్లా వ్యాప్తంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. క‌ర్నూలు న‌గ‌రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. నకిలీ మద్యం తయారీని చంద్ర‌బాబు స‌ర్కార్ కుటీర పరిశ్రమలా మర్చింద‌టూ ఎస్వీ మోహ‌న్‌రెడ్డి ఫైర్ అ య్యారు. నకిలీ మద్యం రాకెట్ ను అరెస్టు చేయాలనీ, మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలనే డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట పార్టీ నాయ‌కులు నిర‌స‌న వ్య‌క్తం చేసి కల్తీ మద్యం నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగించాలని చూస్తే ఊరుకునేది లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి హెచ్చ‌రించారు. పీపీపీ విధానాన్ని విరమించుకునేంత వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నట్లు ఆయ‌న‌ ప్రకటించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి నేతల బినామీలకు కట్ట బెట్టేందుకు పీపీపీ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చారన్నారు. గత ప్రభుత్వం 17 వైద్య కళాశాలల నిర్మాణంలో భాగంగా వేలాది ఎకరాలు కేటాయించి ఒక్కొక్క బిల్డింగ్కు రూ.300 కోట్లు ఖర్చు చేసింద న్నారు. వాటిని ఎలా ప్రైవేటు వ్యక్తులకు కేటాయి స్తారని ప్రశ్నించారు. దాదాపు రూ.10 వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సెల్ అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు, కార్పొరేటర్ షాషా వలీ, పార్టీ నేతలు లాజరస్, వస్తాద్, నీలకంటూ, రాజశేఖర్, శ్రీను పాల్గొన్నారు.

Back to Top