నారావారి నకిలీ మద్యంతో అమాయ‌క ప్ర‌జ‌లు  బ‌లి

వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ ఆగ్ర‌హం

కోడుమూరులో న‌కిలీ మ‌ద్యంపై వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట‌

క‌ర్నూలు: నారావారి న‌కిలీ మ‌ద్యంతో అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాలు బ‌లి తీసుకుంటున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ మండిప‌డ్డారు. నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి, దానిని రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తూ, ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ ఆదిమూల‌పు స‌తీష్ ఆధ్వ‌ర్యంలో పోరుబాట చేప‌ట్టారు. పార్టీ ఎస్ఈసీ స‌భ్యులు, మాజీ కుడా చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి ఆదేశాల మేరకు  కోడుమూరు ప‌ట్ట‌ణంలో  భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేప‌ట్టి, ఎక్సైజ్‌ శాఖ కార్యాలయాల ఎదుట ధ‌ర్నా చేశారు. అనంతరం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు విన‌తిప‌త్రం సమర్పించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్‌సీపీ ఐదేళ్ల పాల‌న‌లో ప్రజలకు మద్యాన్ని దూరం చేసి వారి ఆరోగ్యాన్ని వైఎస్‌ జగన్‌ కాపాడార‌ని తెలిపారు. ఏపీలో 43వేల బెల్ట్ షాపులు తొలగించిన ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌దే అన్నారు. మద్యం దుకాణాలను మూసేశార‌ని గుర్తు చేశారు. ఇవాళ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తి ఊర్లోను బెల్ట్‌షాపులు వెలిశాయ‌న్నారు.రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి పని చేస్తుంద‌ని విమ‌ర్శించారు.

కల్తీ మద్యం తయారు చేసి బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్‌ రూము ద్వారా ప్రజల వద్దకు చేరుస్తున్నార‌ని ఆరోపించారు.  చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. వీటివల్ల మహిళల మాన, ప్రాణాలకి హాని కలుగుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 21 శాతం గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయ‌ని గుర్తు చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుంద‌ని పేర్కొన్నారు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంద‌ని, ఈ కేసును సీబీఐకి అప్పగించాల‌ని, ఎన్‌ బ్రాండ్ మద్యాన్ని వెంటనే నిలుపుదల చేయాల‌ని ఆదిమూల‌పు స‌తీష్‌ డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో కోడుమూరు జడ్పిటిసి రఘునాథరెడ్డి, వైస్ ఎంపీపీ బోయ మాధవి, ఎంపీటీసీ అనురాధ, రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి గౌతం, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లా ప్రచార విభాగం కార్యదర్శి నరసింహారెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా కార్యదర్శి మక్బుల్, సాహిద్ దివాకర్ రెడ్డి, యువజన విభాగం ఉపాధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి కార్మిక శాఖ విభాగం ఉపాధ్యక్షులు ఆదాం జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కృష్ణాపురం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి జిల్లా కార్యదర్శిలు శివ రాముడు, ప్రభాకర్, కోడుమూరు, సి బెలగల్ , కర్నూలు, గూడూరు మండల కన్వీనర్లు రమేష్ నాయుడు, సోమశేఖర్ రెడ్డి, మోహన్ బాబు, రామాంజనేయులు, కోడుమూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఎంకే వెంకటేష్ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, మైనార్టీ విభాగం అధ్యక్షులు బందే నవాజ్, ఆర్టిఐ  విభాగం అధ్యక్షులు జగదీష్, వాలంటరీ విభాగం అధ్యక్షులు మల్లికార్జున, వికలాంగుల విభాగం అధ్యక్షులు మునెప్ప, చేనేత విభాగం అధ్యక్షులు లింగమూర్తి, దస్తగిరి,ఉప సర్పంచ్ మాదాలు, సమరసింహారెడ్డి,  ప్యాలకుర్తి రామకృష్ణారెడ్డి,రవికుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, మాధవ స్వామి, బోయ వెంకటేష్, రమేష్, కోటేశ్వర్ రెడ్డి, అజీవుల్లా,  రామచంద్ర, రంగనాయకులు, తిరుమలేష్, నాగరాజు, ఎంపీటీసీ సందప్ప, మునగల సర్పంచ్ గోపాల్, ప్రసాదు, కర్నూలు ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, గూడూరు ఎస్సీ సెల్ అధ్యక్షులు నరేష్, కైలాస్, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, వార్డ్ నెంబర్ హనుమంతు, శ్రీనివాసులు, శివశంకర్, జాకీర్,  నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top