కర్నూలు: కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో పచ్చమూకలు రెచ్చిపోయారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ గూండాలు దాడి చేశాయి. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు వెళ్తుండగా టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాల దాడిలో వైయస్ఆర్‌సీపీ ఎంపీపీ వాహనం ధ్వంసమైంది. వైయస్ఆర్‌సీపీ నేతలు గ్రామంలోకి అడుగు పెట్టకూడదు అంటూ హుకుం జారీ చేశారు. గ్రామంలో రెచ్చిపోతూ స్థానికుల్ని టీడీపీ గూండాలు భయబ్రాంతులకు గురి చేశారు.