`ప్రతి ఇంటా దీపాలు వెలగాలి. ఆనందాలు వెల్లువలా పొంగాలి’

మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు 

తాడేప‌ల్లి: వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 
    దీపావళి అంటేనే కాంతి, వెలుగుతో పాటు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ అని వైయస్‌ జగన్‌ అన్నారు. ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. 
    ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని  వైయస్‌ జగన్‌ అభిలషించారు.

Back to Top