శ్రీకాకుళం:మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటన సాక్షిగా కూటమి ప్రభుత్వ తప్పుడు ప్రచారం బట్టబయలైందని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 60 పీజీ సీట్లను కేటాయించడం ద్వారా... చంద్రబాబు ప్రభుత్వ విషప్రచారనికి తెరపడిందని తేల్చి చెప్పారు. శ్రీకాకుళంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వైయస్.జగన్ హయాంలో మెడికల్ కాలేజీలే కట్టలేదంటూ, పాత ఫోటోలతో దుష్ప్రచారం చేసిన మంత్రులు... కాలేజీలు కట్టకపోతే ఎన్ ఎమ్ సీ పీజీ సీట్లు ఎందుకు కేటాయించిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చూస్తే.. ప్రజలకు వైయస్.జగనే గుర్తుకువస్తాయన్న అక్కసుతోనే ప్రైవేటీకరణ పేరుతో తమ వారికి కట్టజెప్పే కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ● అతలాకుతలం అవుతున్న రాష్ట్రం- డైవర్షన్ కు తెరతీసిన ప్రభుత్వం... గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్రమంతా అతలాకుతలం అవుతోంది. ఒకవైపు నకిలీ మద్యం అమ్మకాలు, మరోవైపు వైయస్.జగన్ తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వ వైఖరిపై చర్చ జరుగుతోంది. వీటన్నింటి డైవర్షన్ కోసం ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాం, ఇది గొప్ప అచీవ్ మెంట్ అంటూ ప్రభుత్వం కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం చోటుచేసుకుంది. నెల రోజులుగా వైయస్.జగన్ సహా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. మా హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశాం. వాటిలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయగా.. వాటిలో 5 కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం కాగా... మరో 2 కాలేజీలను తరగతులు మొదలుపెట్టడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కొద్దిపనులు పూర్తి చేస్తే మరో 3 కాలేజీల్లో తరగతులు మొదలుపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకో 7 కాలేజీలను 2025-26 నాటికి సిద్దం చేసుకోవాలి ఒక నిర్ణీత కాలవ్యవధిని ఏర్పాటు చేసుకుని... ఆర్ధికంగా అవసరమైన అన్ని ఏర్పాటులను వైయస్.జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజలకు మంచి జరగాలని, పేదలు నాణ్యమైన వైద్యం, డాక్టరు కావాలన్న పేదవాడి కల నిజం కావాలని వైయస్.జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం పదే, పదే చెబుతుంటే... మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులు, ఇతర కూటమి నేతలు వరకు అసలు వైయస్.జగన్ అస్సలు మెడికల్ కాలేజీలే కట్టలేదు. అంతా అబద్ధం, కాలేజీలు ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయని ఊదరగొడుతున్నారు. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇదే మాట చెప్పారు. హోంమంత్రి అనిత అయితే ఫ్రొఫెసర్ మాదిరిగా ఓ ప్రజెంటేషన్ ఇస్తూ... విజయనగరం, రాజమండ్రి మెడికల్ కాలేజీ గురించి చూపిస్తూ.. కాలేజీ పనులు మొదలైనప్పుడు ఫోటో, ఏలూరు మెడికల్ గురించి పునాదుల నిర్మాణం నాటి ఫోటోలను తీసుకొచ్చి.. ప్రభుత్వం పెద్దలు ప్రజలను ఏమార్చే పని చేశారు. వాళ్లకున్న మీడియా బలాన్ని అడ్డం పెట్టుకుని వైయస్.జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టలేదని పదే, పదే అసత్య ప్రచారాన్ని ప్రజల ముద్దే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ● మెడికల్ కౌన్సిల్ ప్రకటనతో బట్టబయలు... ఇదే టైంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వైయస్.జగన్ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకుని క్లాసులు ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు పీజీ సీట్లను మంజూరు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తారు ? వైయస్.జగన్ హయాంలో కేవలం రూ.212 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెబుతూ వస్తున్న నేపధ్యంలో..ఎన్ ఎం సీ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాజమండ్రి, నంద్యాలలో 16 పోస్టులు చొప్పున పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు మంజారు చేసింది. విజయనగరం, మచిలీపట్నంలో 12 పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల చొప్పున, ఏలూరులో 4 పీజీ సీట్లు మొత్తం 60 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను కొత్త మెడికల్ కాలేజీల్లో మంజూరు చేశారు. ప్రభుత్వం చెప్పినట్లు మెడికల్ కాలేజీలు భవనాలు పూర్తికాకపోయుంటే, మెడికల్ కాలేజీల ప్రారంభం కాకపోయి ఉంటే, మెడికల్ కాలేజీల మౌలిక సదుపాయాలు కల్పించకపోయి ఉంటే, సిబ్బంది లేకుంటే.. నేషనల్ మెడికల్ కౌన్సిల్... పీజీ సీట్లను మంజూరు చేస్తుందా? అన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. ● అక్కసుతోనే చంద్రబాబు ప్రైవేటీకరణ... ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చూస్తే వైయస్.జగన్ మొహం గుర్తుకువస్తుందని, మెడికల్ కాలేజీల గురించి ఆలోచిస్తే వైయస్.జగన్ విజన్ ప్రజల మనసుల్లో మెదులుతుందన్న ఆలోచనతోనే కూటమిప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. అంతే కాకుండా ఇదే మంచి విధానం చెప్పి అడ్డగోలుగా వాదిస్తోంది. ఇది చాలా తప్పుడు విధానం. దేశంలో ఎక్కడా ఈ విధమైన పరిస్థితులు లేవు. ఒకవైపు డబ్బులు లేవు, బడ్జెట్ సపోర్టు చేయడం లేదని చెబుతున్నారు. మరోపక్క నుంచి నేను సృష్టించిన సంపదే ప్రజలకు పంచుతున్నానని చెబుతూనే... ప్రభుత్వానికి ఆదాయాలు రావాల్సిన చోట ప్రైవేటు వ్యక్తులకు అమ్ముడుపోయి వారికి ప్రభుత్వ ఆస్తులను పప్పు, బెల్లాల్లా ధారాధత్తం చేస్తున్నారు. లూలూ ప్రైవేటు షాపింగ్ మాల్ కు ప్రభుత్వం ఎప్పుడైనా ఉచితంగా భూములిస్తుందా? ఇది ఎక్కడైనా ఉందా? రూ.1000-1500 కోట్లు ఖరీదు చేసే భూములను ఉచితంగా ప్రైవేటు మాల్స్ కు కట్టబెడుతున్నారు. విజయవాడలో లులూ మాల్ కు రూ. 400 నుంచి రూ.600 కోట్ల ఖరీదు చేసే భూమిని ఉచితంగా ఇస్తున్నారు. ప్రైవేటు షాపింగ్ మాల్ వలన వచ్చే ఉద్యోగాలు ఎన్ని?, అది క్రియేట్ చేసే ఎకో సిస్టమ్ ఎంత ? ● డేటా సెంటర్ తో రాష్ట్ర ప్రయోజనాలేంటి ? కొద్దిరోజుల్లో ప్రజల్లో గూగుల్ డేటా సెంటర్ పై చర్చ జరుగుతోంది. గూగుల్ వల్ల ఎన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మనకు ఉపయోగం ఉందా ? లేదా ? పర్యావరణపరంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏ స్ధాయిలో రాయితీలు ఇస్తుందన్న చర్చ జరుగుతోంది. దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం గురించి ప్రజలకు తెలియజేయాలి. ఇవాళ గూగుల్ ఆదానీ జాయింట్ వెంచర్ కింద మరో ఫార్మాట్ లో ఒప్పందం చేసుకుంటున్నారు. రూ.22వేల కోట్ల పైచిలుకు రాయితీలు రూపంలో ఇస్తున్నారు. ఇక్కడ రాష్ట్రానికి రెవెన్యూ ఎలా పెరుగుతుంది? గతంలో వైస్.జగన్ హయాంలో ఆదానీ సంస్ధతో డేటా సెంటర్ ఏర్పాటు సయమంలో చేసుకున్న ఒప్పందానికి, ఈ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి చాలా తేడా ఉంది. మా ప్రభుత్వం హయాంలో డేటా సెంటర్ తో పాటు ఒక ఐటీ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 25 వేల ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం చేసుకున్నాం. ఆ రోజు ఆదానీ సంస్ధకు ఈ స్ధాయిలో ఇన్సెంటివ్స్ రూపంలో ఇవ్వలేదు. ● రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న ప్రభుత్వం... అలాగే ఏ పీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్రో కెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ ను హక్కుగా చట్టంలో పొందుపరిచారు. ఆ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం హెచ్ పీసీఎల్, ఐఓల్ లలో ఏదో ఒక పెట్రో కెమికల్ అండ్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. దానిమీద అవసరమైతే న్యాయపోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గతంలోవైయస్.జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ప్రధానమంత్రితో పలుమార్లు ప్రస్తావించడంతో పాటు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని మూడు దఫాలుగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన హెచ్ పీ సీ ఎల్ రాష్ట్రానికి ఒక ప్రతిపాదన చేస్తూ... పెట్రో కెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ ఏపీలో ఏర్పాటు చేస్తాం, అందుకు అవసరమైన 2-3 వేల ఎకరాల భూమితో పాటు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.5,400 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి కట్టాలని చెప్పింది. తద్వారా ప్రాజెక్టు వస్తుందని చెప్పారు. దానికి వైయస్.జగన్ కేంద్రానికి లేఖ రాస్తూ... 2,3 వేల ఎకరాలంటే దాని ఖరీదే రూ.3వేల కోట్లు ఖరీదు చేస్తుంది. దానితో పాటు 100 శాతం ఎస్ జీ ఎస్ టీ రీయింబర్స్ చేయడంతో పాటు, ఎలక్ట్రికల్ ఛార్జీస్ రీయింబర్స్ మెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జ్ రద్దు చేస్తామని చెబుతూ ఇవన్నీ మీరు అడిగిన వయబులిటీ గ్యాఫ్ ఫండ్ కంటే ఎక్కువ ఇచ్చినట్లే అవుతుంది కాబట్టి.. ఈ వీజీఎస్ ని తొలగించాలని కోరారు. దానికి సూత్రప్రాయంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలో కాకినాడ సమీపంలో పెట్రో కెమికల్ రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈలోగా ఎన్నికలు రావడంతో అది కాస్తా పక్కన జరిగింది. అలాంటి పెట్రో కెమికల్ రిఫైనరీ కాంప్లెక్స్ ను హక్కుగా సాధించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు పూర్తిగా మోకరిల్లింది. బీపీసీఎల్ ఏపీలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు మందుకు వచ్చింది. దీనికి రామాయపట్నం వచ్చ 4-5 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేసింది. బీపీసీఎల్ దాదాపు 20 ఏళ్ల కాలంలో రూ.96 వేల కోట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకిస్తున్న రాయితీలు చూస్తే.. రాష్ట్ర ఖజానాను ఏ విదంగా గుల్ల చేస్తున్నారో అర్దం అవుతుంది. దాని ప్రకారం 15 వార్షిక వాయిదాల్లో రూ.42 వేల కోట్ల మూల ధన సబ్సిడీ ఇవ్వడానికి అంగీకరించినంది. అంటే ప్రతి ఏటా రూ.3వేల కోట్లు క్యాపిటల్ సబ్సిడీ కింద బీపీసీఎల్ కి ఇవ్వడానికి సిద్ధమైంది. రూ.18 వేల కోట్ల విలువైన ఎస్ జీ ఎస్ టీ ని 100 శాతం రద్దు చేయాలని నిర్ణయించింది. దాని విలువ రూ.18వేల కోట్లు. మిగిలిన మినహాయింపులకు సంబంధించిన ఎస్ జీ ఎస్ టీ 100 శాతం రీయింబర్స్ మెంట్ విలువ మరో రూ.7,400 కోట్లు, ఎలక్రికల్ ఛార్జీల రీయింబర్స్ మెంట్ రూ.4940 కోట్లు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.150 కోట్లు మొత్తం రూ.72,640 కోట్లను ఇన్సెంటివ్స్ రూపంలో బీపీసీఎల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. దీనికోసం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టులో పెట్టాల్సిన అవసరం లేదు, మన హక్కు అని నినదించాల్సిన అవసరమూ లేదు. అన్నింటికంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్ డీ యే లో భాగస్వామిగా ఉండడం ఎందుకు ? మీ మద్దతుతో ఎన్డీయే నడుస్తుందని మీరు గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? ఇదేమని అడిగితే చంద్రాబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు అని చేతులెత్తేస్తారు. ఇక ఇటీవల ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, గొడవలు, రాస్తారోకోలు చేసి కేబినెట్ సబ్ కమిటీ మందు చర్చించుకుని ముఖ్యమంత్రి ముందు కూర్చొంటే.. ఆయన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహణా ఖర్చు తగ్గించుకుంటున్నాయి. మన ప్రభుత్వంలో మాత్రం పెరిగిపోయిందని చెబుతున్నారు. ఆ రోజు మీకు ఎవరు అన్ని హామీలు ఇమ్మన్నారు? నాకుఅనుభం ఉంది, నేను సంపద సృష్టిస్తాను, ఆ సంపను పంచుతాను అని మీరే చెప్పారు కదా? చివరకు ఉద్యోగులు పీఆర్సీ, డీఏ, ఐఆర్ గురించి అడిగితే ఇప్పుడా పరిస్థితి లేదని చెబుతున్నారు. సంపద సృష్టిస్తాను, ఆ తర్వాత మీకు పాస్ చేస్తానంటున్నారు. అదెప్పుడు జరుగుతుంది? ఇప్పటికే మీరు మూడుదఫాలుగా ముఖ్యమంత్రిగా చేశారు. అదే జరిగితే రాష్ట్రానికి ఇన్ని ఇబ్బందులే రావు. అధికార దాహంతో రాష్ట్రాన్ని అంధకారంవైపు నెడుతున్నారు. ● ప్రచారానికి వందల కోట్లు దుర్వినియోగం... మీ కార్యక్రమాలకు రూ.వందల కోట్లు ఖర్చుపెడుతున్నారు. రూ.4,500 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు నిర్మించలేని మీరు, కృష్ణానదిమీద 2.5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి పేరుతో రూ.2,500 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. రూ.500 కోట్లు పెడితే మెడికల్ కాలేజీ పూర్తవుతుంది కానీ దానికి మీ దగ్గర డబ్బుల్లేవు అని చెబుతారు. ఒకవైపు రూ8,500 కోట్ల విలువైన మెడికల్ కాలేజీలు పూర్తిచేయడానికి వైయస్.జగన్ చెప్పినట్లు చేస్తే... 20, 25 ఏళ్లు పడుతుందని చెబుతారు.. మరోవైపు రూ.60-70 వేల కోట్లతో అమరావతిలో మీరు చేస్తున్న నిర్మాణాలు మాత్రం 2-3 ఏళ్లలో పూర్తిచేస్తామని చెబుతున్నారు. మీకు నచ్చితే లక్షల కోట్ల సంపద రెండు మూడేళ్లలో కరిగబెడతారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సంపద సృష్టించే ప్రాజెక్టులు, మీరు చెప్పిన ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు సంపద సృష్టిస్తాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల మెడికల్ హబ్ తయారవుతుంది. మీ దగ్గర డబ్బుల్లేవు అంటూనే మీరిచ్చి ఇన్సెంటివ్ లు చూస్తుంటే.. ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టు దగ్గర సాగిలపడుతున్న పరిస్థితి. అనకాపల్లి దగ్గర ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. రూ.1లక్ష కోట్లు పెట్టుబడి అంటున్నారు. రూ.2000 కోట్లు భూసేకరణ కోసం అవసరం కాగా... అది రెండు, మూడు విడతల్లో ఇస్తామంటే దానికి ఓకే అంటున్నారు. రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేవాళ్లు రూ.2వేల కోట్ల భూసేకరణ అమౌంట్ కు కూడా వాయిదాలా ? ● ప్రైవేటు కంపెనీలకు భూముల పందేరం.. ప్రైవేటు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఉచితంగా భూములు కట్టబెడుతున్నారు. సత్వా, రహేజా ఇవన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఉచితంగా, సబ్సిడీ మీద భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. విశాఖ ఈ కేపబులిటీకి రావడానికి దశాబ్దాల టైం పట్టింది. అలాంటి వైజాగ్ మీద విపరీతంగా బురజ జల్లారు. వైయస్.జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే విశాఖలో భూకంపాలు వస్తాయని, విశాఖ సురక్షితం కాదు, తుఫాన్లు వస్తాయి అని రోజూ వార్తలు రాశారు. అలాంటి చోట రాజధాని ఎలా అని, నిండా నీటితో మునిగిపోయిన ప్రాంతం రాజధానికి అనువైనదని మీరు రాస్తారు. ఇన్ ఫో సిస్ వంటి సంస్థలు వైయస్.జగన్ హయాంలో వచ్చాయి. ఆదానీ టెక్ పార్క్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వైయస్.జగన్ హయాంలో వచ్చాయి.కూటమి ప్రభుత్వం వైజాగ్ కి చేసిందేమీ లేదు. వైయస్.జగన్ కట్టలేదని చెబుతున్న మెడికల్ కాలేజీల్లో ఎన్ ఎమ్ సీ... పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు మంజూరు చేసిన నేపధ్యంలో.. కొద్దో గొప్పో నిధులు వెచ్చిస్తే.. పూర్తయ్యే ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు, వాటిని ప్రైవేటీకరణ చేయాలన్ననిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఈ ఏడాదైనా ఎన్ ఎమ్ సీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలని కోరుతున్నాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కోటి సంతకాల ఉద్యమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు, నిపుణులు దీనిపై సానుకూలంగా స్పందిస్తున్న నేపధ్యంలో... ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ● పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ... సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు మెడికల్ కాలేజీల విషయంలో తప్పుడు నిర్ణయాలకు పాల్పడుతున్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అత్యుత్తమ వైద్యం అందింది. ఏ ప్రైవేటు సంస్థ ప్రభుత్వ ఆసుపత్రుల కంటా మెరుగైన సేవ ఇచ్చారా ? కల్తీ మద్యం రాష్ట్రమంతా ఏరులై పారుతుంది. నకిలీ మద్యం అనే చంద్రబాబు చెప్పిన సంజీవని తయారు చేయడానికి ములకలచెరువులో తయారీ ఫ్యాక్టరీ పెట్టి, రాష్ట్ర మంతా సబ్ సెంటర్లు పెట్టి చంద్రబాబు ఈ సంజీవని తయారుచేసే కార్యక్రమం నిర్విరామంగా తయారు చేశారు. దురదృష్టవశాత్తూ అది బయటపడింది కానీ.. మరో మూడు సంవత్సరాలు వేచి చూస్తే... మొలకల చెరువులో తయారైన నకిలీ మద్యం ప్రభావం చాలా స్పష్టంగా తెలిసుండేది. ఎంత దారుణమంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులే నకిలీ మద్యం కేసులో అరెస్టైతే వైయస్ఆర్‌సీపీ వల్లే నకిలీ మద్యం అని చెబుతారా ? మా వాదనలు ప్రజలకు చేరడానికి ఇంత ఇబ్బంది పడుతుంటే.. ఏకంగా ఐవీఆర్ ఎస్ కాల్స్ తో మా మీద దుష్ర్పచారం చేస్తున్నారు. వాళ్లూ వాళ్లకు సపోర్టు చేస్తున్న మీడియా రాష్ట్రానికి పట్టిన దురదృష్టం.