ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్ర‌జా ఉద్యమం 

ఏలూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు

ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మామిళ్ళపల్లి జయ ప్రకాష్ ఆధ్వ‌ర్యంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ 

ఏలూరు: కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఏకపక్ష నిర్ణయాలతో మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకుందని, దానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలు చేద్దామని ఏలూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు దూలం నాగేశ్వ‌ర‌రావు అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం  ఏలూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త  మామిళ్ళపల్లి జయ ప్రకాష్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టారు. ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జీ కారుమూరి సునీల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా దూలం నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ.. మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసి, పేద విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ దుష్ట చర్యలను నిరసిస్తూ సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలను పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈనెల 10 నుంచి 22వ తేదీ వరకు గ్రామ, వార్డుల్లో రచ్చబండ, సంతకాల సేకరణ, 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్‌ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్‌ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు తరలింపు, 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపు, గవర్నర్‌కు నివేదన, కోటి సంతకాల పత్రాల అందజేత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గుడిదేసి శ్రీనివాసరావు , రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నుకపెయ్యి సుధీర్ బాబు  , జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నేరుసు చిరంజీవి గారు, జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్ గారు, దాసరి రమేష్ గారు, లంకలపల్లి గణేష్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి , నాయ‌కులు  ఏసు పాదం త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top