నకిలీ మద్యంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత డిమాండ్‌

నెల్లూరు జిల్లా: నకిలీ మద్యం వ్య‌వ‌హారంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్ర‌వారం పార్టీ రాష్ట్ర జోనల్ విభాగం మహిళా అధ్యక్షురాలు మొయిళ్ళ గౌరీ, నెల్లూరు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీ సునంద, నెల్లూరు నగర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తనుజా రెడ్డి , నెల్లూరు రూరల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రమాదేవితో క‌లిసి ఆమె మీడియాతో మాట్లాడారు. కాకాణి పూజిత ఏమ‌న్నారంటే..ఆమె మాట‌ల్లోనే.. 

  • రాష్ట్రంలో నకిలీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, కూటమి ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుంది.
  • కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మరిచి డైవర్షన్ పాలిటిక్స్ కు పూనుకోవడం దారుణం.
  • నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు ప్రభుత్వానికి తెలిసినా, మొక్కుబడిగా కొందరిపై కేసులు నమోదు చేసి స‌రిపెట్టుకుంటున్నారు.
  • నకిలీ మద్యం కేసులో బయటపడిన తెలుగుదేశం నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు.
  • నకిలీ మద్యం తయారీలో ప్రధాన పాత్రదారులను కూటమి ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తుంది.
  • నకిలీ మద్యం కేసును కూటమి నేతలు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం హాస్యాస్పదం.
  • రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణమైన నకిలీ మద్యం కేసును సిబిఐ విచారణ కోరకుండా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్‌ అధికారులు చేత చేయించడంతోనే కేసును కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి.
  • లేని నకిలీ మద్యం స్కామ్ పై సిట్ విచారణ జరుగుతున్నా, కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఎందుకు అరికట్టలేకపోతుంది.
  • సిట్ విచారణ పేరుతో కేసులో సంబంధం లేని జోగి రమేష్ గారిపై కేసును ఆపాదించడం సరికాదు.
  • జోగి రమేష్ గారు ఎటువంటి తప్పు చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధపడినా, కూటమినేతలు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
  • నకిలీ మద్యంపై వార్తలు రాసే మీడియాపై కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది.
  • సాక్షి మీడియా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ, నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తుంటే, కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకొని  కేసులు పెట్టి, విచారణ పేరుతో నానా యాగి చేస్తున్నారు.
  • మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని ప్రధాన పాత్ర పోషించే మీడియాపై కూటమి ప్ర‌భుత్వపు చర్యలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఖండిస్తుంది.
  • వైయ‌స్ జ‌గ‌న్ పై అవాస్తవాలు ప్రచురించే తమ అనుకూల మీడియాను విడిచిపెట్టి, నిజా నిజాలు నిగ్గు తేలుస్తూ, ప్రజలకు వాస్తవాలు తెలియజేసే సాక్షి లాంటి మీడియాపై కూటమి ప్రభుత్వం పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తుంది.
  • నిజాలను బయటపెట్టే సాక్షి మీడియా కృషిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
  • కూటమి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించకుండా, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు.
  • గ్రామాలలో ఎక్కడపడితే అక్కడ బెల్టు షాపులు నిర్వహిస్తూ, రాష్ట్రం మొత్తం మద్యం ఏరులై పారుతుంది.
  • కూటమి ప్రభుత్వం ఆదాయమే లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది.
  • రాష్ట్రంలో మహిళలు భయాందోళన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
  • కూటమి ప్రభుత్వంలో గ్రామాలలో నకిలీ మద్యం తయారీ ఒక కుటీర పరిశ్రమగా తయారైంది.
  • నకిలీ మద్యం మన రాష్ట్రంలో తయారయ్యి పక్క రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తుంటే, ప్రభుత్వం ఎందుకు నిరోధించడానికి చర్యలు తీసుకోవడం లేదు.
  • ప్రతి మద్యం షాపులో నాలుగు మద్యం బాటిళ్లలో ఒక నకిలీ మద్యం బాటిల్ అమ్ముతుంటే, అధికారులు ఎందుకు గుర్తించి,  ప్రజల ప్రాణాలను కాపాడలేకున్నారు.
  • వైయ‌స్ జ‌గ‌న్ హయాంలో లిక్కర్ పాలసీలో మొత్తం ప్రభుత్వమే మద్యం షాపులను నడిపింది.
  • ఎక్కడ ఎటువంటి బెల్టు షాపులు నిర్వహించకుండా నిరోధించారు.
  • ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పొందుపరచడం ద్వారా నకిలీ మద్యం బారిన పడకుండా ప్రజలను రక్షించారు.
  • సెబ్ ను ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా నిత్యం తనిఖీలు చేయించారు.
  • ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి.
  • కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి ప్రజల  సంక్షేమం గురించి పూర్తిగా విస్మరించింది.
  • కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో పేదలకు వైద్య విద్యను దూరం చేయడంతో పాటు, ప్ర‌జల ఆరోగ్యాన్ని నకిలీ మద్యం ద్వారా క్షీణింపజేస్తుంది.
  • కూటమి ప్రభుత్వ పాలనంతా, కక్ష సాధింపు చర్యలు, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, దాడులు చేయించడంతో  సరిపోయింది.
  • ఇకనైనా కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయాలి.
  • రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టడంతో పాటు, నకిలీ మద్యంపై సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం.
  • వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  నాయకత్వంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను  నిలబెట్టుకునేంతవరకు పోరాటం కొనసాగిస్తాం.
Back to Top