అరకులోయ : అరకులోయ మండలం పద్మాపురం మేజర్ పంచాయతీలో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు అధికారికంగా శంకుస్థాపన జరిగింది. అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రేగం మత్స్యలింగం, పద్మాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టేలీ సుస్మితా తో కలిసి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ. 3,50,000 వ్యయంతో చేపట్టనున్న ఈ డ్రైనేజీ నిర్మాణం 50 మీటర్లు ఉండనుంది. గ్రామ అభివృద్ధిలో ఇది ఒక కీలక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ—“గ్రామ అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం. డ్రైనేజీ నిర్మాణం నాణ్యతతో జరగాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ప్రజల అవసరాలను గుర్తించి ముందుగా పనిచేస్తున్న సర్పంచ్ సుస్మితా గారికి అభినందనలు,” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అరకులోయ మండలం జెడ్పీటీసీ శెట్టి రోషిణి , వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య , మండల పార్టీ అధ్యక్షుడు స్వాబి రామ్ మూర్తి, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కమ్మిడి అశోక్ తదితరులు పాల్గొన్నారు.