తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బూత్ కమిటీ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన కాజులూరి వెంకట సుబ్బారెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.