రామ్మోహన్‌ నాయుడును పదవి నుండి వెంటనే బర్తరఫ్‌ చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి జూపూడి ప్రభాకర్ డిమాండ్‌

తాడేపల్లి: దేశీయ విమానయాన రంగంలో సంక్షోభ పరిస్థితుల వేళ వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఇండిగో సంస్థతో కుమ్మక్కయ్యారని, అందువల్లే ఈ సంక్షోభం ఏర్పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు కారణమైన కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడును పదవి నుండి వెంటనే బర్తరఫ్‌ చేయాలన్నారు.  

దేశవ్యాప్తంగా ఇంత సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రామ్మోహన్‌ నాయుడు రీల్స్ చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారని విమర్శించారు. ఆయన విమానయానశాఖ మంత్రిగా కాకుండా రీల్స్ మంత్రిగా మారారని దుయ్యబట్టారు. ఇండిగో సంక్షోభాన్ని వదిలేసి సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసుకుంటూ గడుపుతున్నారన్నారు. అహ్మదాబాద్ విమాన‌ ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటిని కచ్చితంగా పాటించేలా చూడాలని విమానాయాన సంస్థలకు ఆదేశాలిచ్చింది.

కానీ డీజీసీఏ నిబంధనలను ఇండిగో పాటించేలా చేయడంలో కేంద్రమంత్రి  రామ్మోహన్‌ నాయుడు విఫలమయ్యారని ఈ ఫలితంగానే ఇప్పుడు ఇండిగో సంక్షోభం వచ్చిందని తెలిపారు. డీజీసీఏ తన రూల్స్‌ను వెనక్కి తీసుకునేలా ఇండిగో వ్యవహరించిందంటే దానికి కారణం కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడేనని కనుక ఆయనను పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని జూపూడి ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు.

నారా లోకేష్ వార్ రూమ్‌లో చర్చలు జరుపుతున్నారంటూ నేషనల్ మీడియాలో మాట్లాడి పరువు తీశారు. అసలు కేంద్ర మంత్రి పదవితో లోకేష్ కి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. లోకేష్‌కి జాకీలు పెట్టి లేపాలనే ఉద్దేశ్యంతో దేశ వ్యాప్తంగా తెలుగు వారి పరువు తీశారని జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు.

Back to Top