విశాఖ దక్షిణం: కల్తీ మద్యం తాగి అమాయకులు మరణిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కనిపించడం లేదా అని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని హడావిడి చేసిన కూటమి నేతలు ఇప్పుడు బయట పడిన కల్తీ మద్యం స్కాం గురించి ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. నకిలీ మద్యం ప్రాణాలతో చెలగాటమా? కల్తీ మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ని జగదాంబ జంక్షన్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణుల నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యేలు ఒక బెల్ట్ షాప్ ఏర్పాటి కోసం 9 లక్షలు వంతున వసూలు చేస్తున్నారనీ.. అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు అన్నారు. మద్యంలో మిథనాల్ 7 శాతం వుంటుంది. ఫలితంగా మందు బాబుల్లో చూపు పోవడం, లంగ్స్ దెబ్బ తినడం జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దమ్ముంటే కల్తీ మద్యం కుంభకోణం మీద సీబీఐ విచారణకు ఆదేశించాలి అని డిమాండ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ దేనికైనా వంద రోజుల సమయం కావాలి అంటారు అని ఎద్దేవా చేశారు. మందు బాబుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారని వందేళ్లు బతకాల్సిన యూత్ 20 నుంచి 25 కే ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. మిథనాల్ అనే పదార్థం రాష్ట్రంలో ఎక్కడ వచ్చిన సరే యుద్ధ పర్మిట్ ప్రభుత్వ అనుమతులు ఉండాలి. ఏపీ ఐసీసీ ద్వారా ఇండస్ట్రియల్ అథారిటీ కి వెళ్ళాలి..లిక్కరో కలిపిదే ఈ బాటిల్ లో 40 శాతం ఇథనాల్ ఉంటాది. అదే మిథానాల్లో కలపాలంటే . పాయింట్ 7 శాతం తక్కువ సరిపోతుంది. దీనిలో చచ్చిపోయిన తేళ్ళు కలుపుతారు. దానికున్న పవర్ తాగిన వాళ్ళు పాయిజన్ తీసుకోవడంతో సమానమన్నారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 40 వేల బెల్ట్ షాపులను మూయించారు అని గుర్తు చేశారు. ప్రభుత్వ మద్యం విక్రయాల కారణంగా మద్యం నియంత్రణలో ఉండేదన్నారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులు పుట్ట గొడుగుల్లా వెలిశాయి అని మండి పడ్డారు . మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు బాగా పారిపోయాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం కారణంగా మందు బాబుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత వారి కుటుంబాలకు దిక్కెవరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, , కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.