జోరు వానలో కూడా ఆగని ‘కల్తీ మద్యం’ నిరసనలు

కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట

కృష్ణా జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు కృష్ణా జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు క‌ల్తీ మ‌ద్యంపై నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఒక‌వైపు జోరు వాన కురుస్తున్నా కూడా లెక్క చేయ‌కుండా ఆందోళ‌న కొన‌సాగించారు. నకిలీ మద్యం నిందితులను అరెస్ట్ చేయాలని ఎక్సైజ్ సీఐకి వినతి పత్రం అందజేశారు. పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో చేప‌ట్టిన‌ నిరసన  కార్యక్రమంలో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. నారావారి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయ‌ని చక్రవర్తి  మండిప‌డ్డారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుంద‌ని పేర్కొన్నారు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంద‌ని ఆరోపించారు. య‌ధేచ్చ‌గా నకిలీ మద్యం తయారవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాల‌ని, ఎక్సైజ్ శాఖ మంత్రిని భర్తరఫ్ చేయాల‌ని,  ఎన్‌ బ్రాండ్ మద్యాన్ని వెంటనే నిలుపుదల చేయాల‌ని చక్రవర్తి డిమాండ్ చేశారు. 

Back to Top