గెలిచినా ఓడినా రియల్ హీరో వైయ‌స్ జగన్  

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ జక్కంపూడి రాజా
 

తూర్పుగోదావరి: గెలిచినా ఓడినా రియల్ హీరో వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి అని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు జ‌క్కంపూడి రాజా అన్నారు. మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయమని అడిగిన దమ్మున్న నాయకుడు వైయ‌స్‌ జగన్‌ మాత్రమే. దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఈ దమ్ముందా? అని స‌వాలు విసిరారు. ‌ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామ‌న్నారు. బుధ‌వారం జ‌క్కంపూడి రాజా మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పది లక్షలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగని రాజానగరం మండల కేంద్రంలో రూ. 20 కోట్ల  అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. 

కన్నతల్లికి బాగోలేదన్నా పట్టించుకోకుండా, నియోజకవర్గం గురించే ఆలోచించానని రాజానగరం మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి రాజా తెలిపారు. కోరుకొండ సీతానగరం మండలాల్లో రెండు పంటలకు నీరు ఇచ్చాం. వ్యవసాయం చక్కగా చేసుకునేందుకు అనువైన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పురుగుమందులు, గోడౌన్లు, యంత్ర పరికరాలు అన్నీ అందించాం. 

రూ. 25 కోట్లతో  తొర్రిగడ్డ పంపిణీ స్కీం మోడరనైజ్ చేశాం. ప్రతి చిన్న ఫిర్యాదుకు స్పందించి జవాబుదారీ తనంతో పని చేశాం. నియోజకవర్గంలో లక్ష కుటుంబాలు ఉంటే 80 వేల కుటుంబాలకు వద్దకు నేనే వెళ్ళాను. నా కుటుంబ సభ్యులంతా ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహించాం. ఇవాల్టి పరిస్థితి చూస్తే ఇంతవరకు భ్రమలో బతికామా అన్నట్టు అనిపిస్తుంది. 

 ఏదేమైనా ప్రజల కోసం పనిచేస్తాం‌. రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతోనే కలిసి నడుస్తాం. కాపు రిజర్వేషన్ కోసం శ్రమించిన ముద్రగడ లాంటి నాయకుడు అనేక మాటలు పడ్డారు. కాపుల కష్టాలను ఏనాడు పట్టించుకోని నాయకులు హీరోలు అయిపోయారని అన్నారు.

Back to Top