హిందూపురం: బాలయ్యా నోరు అదుపులో పెట్టుకో అని వైయస్ఆర్‌సీపీ హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక హెచ్చరించారు. మీ బావ చంద్రబాబు జైలు కెళ్లాడన్న అక్కసుతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావ్. ‘స్కిల్’ స్కాంలో అధికారులు అన్ని రకాలుగా విచారించిన తర్వాతనే అవినీతి జరిగిందని తేల్చి అందుకు కారకుడైన మీ బావ చంద్రబాబును అరెస్టు చేశారు. ఇప్పటికై నా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు.. కాదు..కూడదు ఇలాగే మాట్లాడతానంటే చూస్తూ ఊరుకోబోం.. జాగ్రత్త అని ఎమ్మెల్యే బాలకృష్ణనును దీపిక హెచ్చరించారు. హిందూపురంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. నోరు తెరిస్తే తమకు చరిత్ర ఉందంటున్న బాలకృష్ణ చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కన్నతండ్రి ఎన్టీఆర్‌ను పదవీచ్యుతున్ని చేసి ఘోరంగా అవమానించినప్పుడు కనీసం ఒక్క మాట మాట్లాడని బాలకృష్ణ.. ఇప్పుడు బావ కోసం పడుతున్న బాధలు..చేస్తున్న సవాళ్లు అందరూ గమనిస్తున్నారన్నారు. హిందూపురం ప్రజలు రెండు సార్లు అసెంబ్లీకి పంపితే... కనీసం వాళ్లు ఎలా ఉన్నారో అని పట్టించుకునే సమయం లేని బాలయ్య... బావ కోసం మాత్రం షూటింగ్‌లు వదిలేసి అగమేఘాలపై వచ్చి మాట్లాడున్నాడన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోని ఏకై క ఎమ్మెల్యే బాలకృష్ణనేనన్నారు. 8 నెలలుగా నియోజకవర్గం వైపు తొంగిచూడని బాలకృష్ణకు ప్రజల బాగోగులు ఎలా తెలుస్తాయన్నారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్న బాలకృష్ణ... ఆ కుటుంబం ఆయనకు ఎంత మేలు చేసిందో మరచిపోకూడదన్నారు. ఆనాడు వైయస్ఆర్ దయ చూపకపోయి ఉంటే ఏన్నేళ్లు జైలులో మగ్గేవాడివో ఒకసారి ఆలోచించుకోవాలని బాలకృష్ణకు హితవు పలికారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ, వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ నాయకుడు వేణురెడ్డి మాట్లాడుతూ..నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచిన ఘనత బాలకృష్ణదన్నారు. పండుగకో, పబ్బానికో..వచ్చిపోయే ఎమ్మెల్యే బాలకృష్ణ.. ‘పురం’ ప్రజల బాగోగులను ఎప్పుడో విస్మరించారన్నారు. అందువల్లే ప్రజలు కూడా ఆయన్ను మరచిపోయారన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జబివుల్లా, కౌన్సిలర్లు శివ, రామచంద్రా, షాజియా, ముత్తవల్లి కలీం, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.