ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు

వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి

 తాడేపల్లి: ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేద‌ని వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్ప‌ష్టం చేశారు.  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వ్యవహారంపై స్పందించారు. బుధవారం  వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సర్పంచ్‌ల సమావేశంలో  ఆయన..  మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.  

  ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. గ్రామస్ధాయిలో సర్పంచ్ లు బలమైన వ్యక్తులు. మీరంతా ఉత్సాహంగా పనిచేయడంతోపాటు శ్రీ వైయస్ జగన్ చేపట్టిన పధకాలను ఓన్ చేసుకుని వాటిపై ప్రజలలో చైతన్యం తేవాలి అని  పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో రాష్ర్టంలోని 175 నియోజకవర్గాలనుంచి హాజరైన సర్పంచ్ ల నుధ్దేశించి ఆయన మాట్లాడారు. సమావేశానికి రాష్ర్ట పంచాయితీ శాఖామంత్రి   బూడి ముత్యాలనాయుడు,పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు,శాసనమండలి సభ్యులు  లేళ్ళ అప్పిరెడ్డి హాజరయ్యారు.

     ఈ సందర్భంగా పలువురు సర్పంచ్ లు వారి ప్రాంతాలలోని సమస్యలను,ఇతర అంశాలను  సజ్జల రామకృష్ణారెడ్డి,శ్రీ బూడి ముత్యాలనాయుడుల దృష్టికి తీసుకువెళ్ళారు.వాటిని సిఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్ళి సానుకూలంగా పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

      సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ లు గ్రామస్దాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండే వ్యక్తులు ఎన్నికల ఏడాదిలో శ్రీ వైయస్ జగన్ చేపట్టిన యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాష్ర్ట ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ రాష్ర్టంలోని ప్రతి కుటుంబానికి లబ్ది చేకూర్చేవిదంగా పధకాలను అమలు చేస్తున్నారన్నారు.నిజానికి విభజన నేపధ్యం,చంద్రబాబు రాష్ర్టాన్ని అప్పుల ఊబిలో దించడం,మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులుచేయడం,కోవిడ్ సంక్షోభం వల్ల ఆర్ధిక సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు.ఇవేమీ లేకపోయినా శ్రీ వైయస్ జగన్ రాష్ర్టంలో పేదరికం పొగొట్టడం,బిసి,ఎస్సిఎస్టి,మైనారిటీ లకు విద్య,వైద్యం విషయాలలో ప్రయోజనం కలిగే విధంగా చేసేందుకు దార్శినికతతో ఆలోచన చేశారన్నారు.అందుకే పేదరికాన్ని పొగొట్టేందుకు అనేక పధకాలు అమలు చేస్తున్నారన్నారు.కోవిడ్,చంద్రబాబు చేసిన అప్పుల ఫలితంగా నెలకొన్న పరిస్దితినుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న నేపధ్యంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టలు కోవిడ్ సంక్షోభం వచ్చి పడిందన్నారు.ఇందుకు గత మూడున్నరేళ్లలో శ్రీ వైయస్ జగన్ ఎంతగానో పరిశ్రమించాల్సి వచ్చిందన్నారు.

          శ్రీ వైయస్ జగన్ ముఖ్యంగా పేదరికం లేకుండా చేయాలి. సంపన్నులతో సమానంగా వారికి అవకాశాలు కల్పించాలి.పేదలు వారి కాళ్ళ పై వారు నిలబడేలా చేయాలి అనే దిశగా ఆలోచన చేశారన్నారు. నిజానికి శ్రీ వైయస్ జగన్ చేపట్టిన పధకాలు ప్రజలకు చేరి ఫలితాలు అందబట్టే అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన మున్సిపల్,ఎంపిటిసి,జడ్ పిటిసి,సర్పంచ్ ఎన్నికలలో 90 శాతం వైయస్సార్ కాంగ్రెస్ గెలుచుకోగలిగింది అని అన్నారు. ఈ విషయాన్ని  ప్రతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాలరేగరేసుకుని చెప్పుకునే విధంగా పార్టీ ఉందన్నారు.

        ప్రస్తుతం ఆ ఫలితాలు మరింతగా ప్రజలకు మఖ్యంగా ప్రతి కుటుంబానికి చేరడంతో ఆదరణ మరింతగా పెరిగిందన్నారు. శ్రీ వైయస్ జగన్ పంటిబిగువున అనేక అంశాలను ఓర్పు పట్టి పనిచేస్తున్నారు.ముఖ్యంగా సర్పంచ్ లు ప్రస్తుతం ప్రస్తావిస్తున్న అంశాలు చూస్తే ఒకటి ఆర్దిక పరమైంది.రెండు అధికారాలకు సంబంధించింది.వీటికి సంబంధించినవి ముఖ్యమంత్రిగారి దగ్గరనుంచి అందరికి తెలుసు.ఈ సమయంలోనే అందరూ ఓర్పు పట్టి ఉండాలి.ప్రభుత్వం నిధులను ఎందుకు ఖర్చు చేస్తుంది.వాటి వల్ల ప్రజలకు ఎంతగా మేలు జరుగుతుంది.ఏమాత్రం వృధా కానీయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కూడా ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది.ఆ విషయాన్ని అవగాహన చేసుకుని వాటినుంచి బయటపడే మార్గాలను కూడా సర్పంచ్ లు అర్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలి.అధికారాల పరంగా చూస్తే ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ది చేకూరుస్తూ శ్రీ వైయస్ జగన్ నుందుకు వెళ్తున్నారు.పారదర్శకతతో అందిస్తున్నారు.సిఎం గారు సైతం తనకు విచక్షణాధికారాల కంటే పాలసీ ప్రజలకు చేర్చడంపైనే దృష్టి పెడుతున్నారు.
 ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులంటే ప్రజాసేవకులు కాని దొరలం కాదు.టిడిపి హయాంలో సర్పంచ్ ల అధికారాల విషయంలో చాలా బాధలు ఎదుర్కొన్నారు.జన్మభూమి కమిటీల వల్ల అది జరిగింది.అయితే నేడు జగన్ గారు వాటన్నింటిని బ్రేక్ చేసి లబ్దిదారులకు నేరుగా పారదర్శకతతో పధకాలు అందేలా చేస్తున్నారు.దానిని సర్పంచ్ లు ఓన్ చేసుకోవాలి.గతంలో సమితిలు అపరమితమైన అధికారాలతో ఉండేవి.ఆ తర్వాత మండలాలు వచ్చాయి.ఇప్పుడు మీరు శ్రీ వైయస్ జగన్ గారి ప్రతినిధులుగా పధకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి.ఆయన ప్రతినిధులుగా ప్రజలే మిమ్మల్ని గుర్తిస్తారు.పధకాలు అందుతున్న తీరుతెన్నుల మీరే పరిశీలించాలి.తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందంటే మీకు,మనందరికి ఆదరణ పెరిగినట్లే. జగనన్న ప్రతినిధిగా సమస్యలు పరిష్కరిస్తాం.మనందర్ని కూడా జగన్ గారి ప్రతినిధులుగానే పార్టీ తీసుకువచ్చింది.ఇది సర్పంచ్ లందరూ విశాల దృక్పధంతో ఆలోచించాలి.మరోవైపు చెప్పాలంటే ప్రతిపక్షాలు సర్పంచ్ లుగా కనీస సంఖ్య లేకపోయినా పాత సంఘాల పేరుతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి. నోరు పెట్టుకుని వారికి ఉన్న అనుకూల మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటిని ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న మన పార్టీ సర్పంచ్ లు తిప్పికొట్టాలి.పాజిటివ్ ధింకింగ్ తో ముందుకు వెళ్తూ కమిట్ మెంట్ తో పనిచేయాలన్నారు.అప్పుడే ప్రజలలో ఆదరణ మరింత పెరుగుతుందన్నారు. రాష్ర్ట స్దాయిలో అడహక్ కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు వివరించారు.

రాష్ర్ట పంచాయితీ రాజ్ శాఖమంత్రి  బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ఈరోజు రాష్ర్టంలోని 175 నియోజకవర్గాలనుంచి దాదాపు 175 మంది సర్పంచ్ లతో సమావేశం ఏర్పాటుచేశాం.సర్పంచ్ లుగా వారు ఏమి కోరుకుంటున్నారు.గ్రామాలలో మరింత మెరుగైన పరిపాలన కోసం వారి ఆలోచనలు తెలుకునేందుకు శ్రీ వైయస్ జగన్ ఈ సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించారు.దానిలో భాగంగా ఈ సమావేశం ద్వారా వారి ఆలోచనలు,ఆకాంక్షలు తెలుసుకోవడం జరిగింది.సర్పంచ్ లందరూ తాము ఎన్నికైన తర్వాత తమ గ్రామాలను అభివృద్ది చేయాలనే ఆలోచనతో ఉంటారు.ఇప్పటికే శ్రీ వైయస్ జగన్ గారు అమలు చేస్తున్న పధకాలు గ్రామాలలోని అన్ని కుటుంబాలకు శాచ్యురేషన్ మోడ్ లో అందిస్తున్నారు.సిసి రోడ్లు,డ్రైయిన్లు,సచివాలయ భవనాలు,అర్ బి కే భవనాలు,వెల్ నెస్ సెంటర్లు,డిజిటల్ లైబ్రరీలు,సచివాలయ భవనాలు,బల్క్ మిల్క్ సెంటర్లు,అంగన్ వాడి భవనాలు,నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృధ్ది,ఇతర అభివృధ్ది కార్యక్రమాలపై చర్చించాం.గ్రామపంచాయితీలకు సంబంధించి నిధులను వారే వినియోగించుకునేవిధంగా గ్రామాలకు మేలు చేసే విధంగా అభివృధ్ది చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలియచేేశారు.ప్రజలకు మేలు చేసేందుకు వారు చేపట్టే పనులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయసహకారాలు ఉంటాయి.గ్రామస్వరాజ్యం రావాలంటే గ్రామ అభివృధ్ది జరగాలంటే సచివాలయ వ్యవస్ధ ద్వారా సాద్యమవుతుందని శ్రీ వైయస్ జగన్ విశ్వసించారన్నారు.గ్రామ సర్పంచ్ లు తమకు తగిన విధంగా ప్రోటోకాల్ ఇవ్వాలని కోరారు.అందుకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.వారు ఏవైతే కోరుకుంటున్నారో వాటిని చేయడానికి ప్రభుత్వం చిత్తశుధ్దితో ఉందన్నారు.వారు ప్రస్తావించిన అంశాలను ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగిందన్నారు.పార్టీకి సంబంధించిన సర్పంచ్ లతో రాష్ర్ట స్ధాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటుచేస్తామన్నారు.దాని ద్వారా వారి సమస్యలను గుర్తించి ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. సర్పంచ్ లకు నిధులు ఇవ్వడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధం లేనివన్నారు.ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తించే స్ధితిలో అవి లేవన్నారు.

 లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ లు గ్రామ స్దాయిలో ఎంతో ప్రాముఖ్యత గలవారన్నారు.వారికి పార్టీ పరంగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో వారు మరింత క్రియీశీలకంగా వ్యవహరించాలని కోరారు.సర్పంచ్ లు ఈ సమావేశం దృష్టికి తెచ్చిన అంశాలను సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. సమావేశంలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ శ్రీనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Back to Top