వైయస్‌ జగన్‌ ప్రజాబలం ముందు ఎవ్వరూ నిలవలేరు

ఎంతమంది కలిసి వచ్చినా మా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు

పవన్, చంద్రబాబుల అక్రమ సంబంధానికి పవిత్రతను అంటగట్టే ప్రయత్నం

11 మందిని పొట్టనపెట్టుకున్న చంద్రబాబును పవన్‌ పరామర్శించడం అన్యాయానికి పరాకాష్ట

పందికొక్కులు, గంటనక్కలు ఏకం కావడాన్ని జనం చూస్తున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: ఎంతమంది కలిసి వచ్చినా వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి ఇబ్బంది లేదని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ఉన్న ప్రజాబలం ముందు ఎవరూ నిలవలేరని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ, జనసేనలు ఎప్పుడూ కలిసే ఉన్నాయని, వారి అక్రమ సంబంధానికి పవిత్రతను అంటగట్టే ప్రయత్నం చేశారన్నారు. దీనికి కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్టర్‌ అన్నీ చంద్రబాబేనని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్, చంద్రబాబు మీటింగ్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు.. చంద్రబాబు సభల్లో 11 మంది చనిపోతే.. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిన పవన్‌.. ఆ మరణాలకు కారణమైన చంద్రబాబును పరామర్శించడం విడ్డూరం, అన్యాయానికి, బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట అన్నారు. మృతిచెందిన వారి కుటుంబాలను పవన్‌ కల్యాణ్‌ పరామర్శిస్తే సబబుగా ఉండేదన్నారు. 

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు కుప్పంలో జీవో నంబర్‌.1ను ఉల్లంఘిస్తూ ప్రవర్తించిన తీరును పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండించాల్సిందిపోయి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ప్రజల ప్రాణాల పరిరక్షణ కోసమే జీవో నంబర్‌.1 తీసుకొచ్చాం. జీవో నంబర్‌1లో రోడ్లపై సభలు పెట్టుకోవద్దని మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్‌ విషం చిమ్ముతున్నారు. పేద ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వాన్ని దించాలన్నదే వాళ్ల కుట్ర. ఎంతమంది కలిసి వచ్చినా మా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైయస్‌ జగన్‌ ప్రభుత్వమే. 

2024 షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయి. బలమైన వైయస్‌ జగన్‌ను ఎదుర్కొనేందుకు కుట్రదారుంతా ఏకమవుతున్నారు. పవన్, చంద్రబాబు కలయినను మెచ్చుకున్న సీపీఐ రాష్ట్ర సెక్రటరీ రామకృష్ణ.. బీజేపీ కూడా వారితో కలిస్తే ఏం సమాధానం చెబుతారు. ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో చూడాలి. పందికొక్కులు, గంటనక్కలు ఏకం కావడాన్ని జనం చూస్తున్నారు. వైయస్‌ జగన్‌కు ఉన్న ప్రజాబలం ముందు ఎవరూ నిలవలేరు. 
 

తాజా వీడియోలు

Back to Top