రాక్షసులు అడ్డొచ్చినా సీఎం సంకల్పం చెదరదు

ఇళ్ల పట్టాల పంపిణీ దేశ చరిత్రలో సువర్ణ ఘట్టం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్‌

తాడేపల్లి: క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి రెండూ కలిసి వచ్చిన రోజున ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేపట్టబోయే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం దేశ చరిత్రలో సువర్ణ ఘట్టంగా మిగిలిపోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు సజ్జల ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘దేశ చరిత్రలో సువర్ణ ఘట్టం ఇది. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 30.76 లక్షల మంది కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఉచితంగా ఇళ్లస్థలాలను పంపిణీ చేస్తోంది. రాక్షసులు అడ్డువచ్చినా జగన్‌ గారి సంకల్పం చెదరలేదు. పేదల జీవన ప్రమాణాలను పెంచడంలో ఆయన సేవ తరతరాలుగా గుర్తుండిపోతుంది' అని ట్వీట్ చేశారు.

 

Back to Top