అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ  వైయ‌స్ జగన్ రావాలి..  

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో సంక్షేమం నుంచి అభివృద్ధికి ప‌రుగులు

17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చాము

తాడేప‌ల్లి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ  వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లామని అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలు అందించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ప్రజలకు చేరాయన్నారు. డ్వాక్రా సంఘాలు మేము అధికారంలోకి వచ్చే సమయానికి దెబ్బతిన్నాయని.. వైయ‌స్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలలో కోటి పదిహేను లక్షల మందికి సభ్యుల సంఖ్య పెరిగిందని.. ఇది ఆల్ ఇండియా రికార్డ్ అని పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్ వచ్చిన తరవాత డ్వాక్రా గ్రూపులు పెరిగాయని.. సభ్యుల సంఖ్య పెరిగిందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు నిర్మించామని చెప్పారు. 31 లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చామన్నారు.

 
జీఎస్‌డీపీ 4.87 శాతం పెరుగుద‌ల‌..
టీడీపీ హయాంలో జీఎస్‌డీపీ 4.47 ఉంటే, వైయ‌స్ఆర్‌ సీపీ హయాంలో జీఎస్‌డీపీ 4.87 కి పెరిగిందని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు పెరిగాయన్నారు. మోడీ వచ్చి మేమే అంతా ఇచ్చాం అంటున్నారని.. కానీ కేంద్రం నుంచి వచ్చే సాయం తగ్గిందన్నారు. టీడీపీ హయాంలో 2 లక్షల 58 వేల కోట్ల అప్పులు అయితే… వైయ‌స్ఆర్‌ సీపీ హయాంలో 2 లక్షల 95 వేల కోట్ల రూపాయల అప్పులు అయ్యాయన్నారు. వైయ‌స్ఆర్‌ సీపీ  హయాంలో సంక్షేమం నుంచి అభివృద్ధికి వెళుతున్నామన్నారు. పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని.. రామయ్యపట్నం పోర్టు దగ్గర కంపెనీలు రావడం మొదలు అయ్యాయన్నారు. 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చాము.. అయిదు మెడికల్ కాలేజీలు మొదలు అయ్యాయన్నారు. ఏపీలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం తీసుకువస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు తీసుకువస్తున్నామన్నారు. ఒక వైపు అభివృద్ధి.. మరో వైపు సంక్షేమం కొనసాగుతుందన్నారు. వైజాగ్ గ్రోత్ ఇంజన్ అవుతుందని.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ వైయ‌స్‌ జగన్ రావాలన్నారు.

వైయ‌స్ జ‌గ‌న్ ఇంకా ఏమ‌న్నారంటే..

 • పేదలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది
 • 16 లక్షల మంది మహిళలకు చేయూత పథకం ద్వారా సాయం అందించాం
 • మహిళలకు రూ.75 వేలతో వైయస్‌ఆర్‌ చేయూత ఇస్తున్నాం
 • కోటి కుటుంబాలకు పైగా తమ కాళ్లపై తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి.
 • సంపాదన మెరుగుపరుచుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇది ప్రోగ్రెస్‌ డెవలప్‌మెంట్‌ కాక మరి ఏమవుతుంది? 
 • కోవిడ్‌ సమయంలో కూడా ఎకానమీని నిలబెట్టింది మన పథకాలే. కేవలం వైయస్‌ జగన్‌ దూరదృష్టి. మహిళలను వాళ్ల కాళ్లపై వారు నిలబడే విధంగా చేశారు. ఇది అభివృద్ధికి ఉపయోగపడింది.
 • గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం. ఇళ్ల నిర్మాణాలతో ఉపాధి అవకాశాలు లభించాయి.
 • మన దేశం జీడీపీలో మన రాష్ట్రవాటా టీడీపీ హయాంలో 4.47 ఉంటే..వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 4.82కు పెరిగింది. ఇది గ్రోత్‌ కాదా?. కోవిడ్‌ రెండేళ్లు ఉన్నా ఎలా సాధ్యమైంది?
 • ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన పథకాలు  సకాలంలో ఇవ్వడంతో ఎకానమీ యాక్టివిటి పెరగడంతో అభివృద్ధి జరిగింది. దాని వల్లే జీడీపీ పెరిగింది.
 • మ్యానిఫాచరింగ్‌లో ఎంఎస్‌ఎంఈలు పెరిగాయి. టీడీపీ హయాంలో కియా అంటున్నారు. దానికి మంచి రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చాయి. దీని వల్ల 2.9 శాతం నుంచి 4 వరకు పెరిగింది.
 • క్యాపిటల్‌ ఎక్సైండేచర్‌ టీడీపీ హయాంలో 15 కోట్లు ఉండేవి, మన హయాంలో రూ.17 కోట్లకు పెరిగింది. ఇందులో చెప్పేవన్నీ కేంద్రం లెక్కలే. 
 • కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల వల్ల రాష్ట్రం నిలబడుతుంది. కానీ కేంద్రం నుంచి ఒక శాతం తగ్గింది. అయినా సరే మనం అభివృద్ధి చేయగలిగాం.
 • అప్పులవాటా..టీడీపీ హయాంలో 7.5 శాతం ఉంటే..మన హయాంలో 5.5 శాతం మాత్రమేఉంది. కేంద్రంలో 6.6 శాతం ఉంది. 
Back to Top