విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల భారం చంద్రబాబు చలవే 

రైతులు రుణగ్రస్తులు కావడానికి కారణం చంద్రబాబు విధానాలే.

 ట్రూఅప్ ఛార్జీలకు ఈ ప్రభుత్వమే కారణమంటూ టిడిపి, పచ్చమీడియా దుష్ప్రచారం.

 ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

కురుబ / కురుమ‌ కులస్ధుల ఆత్మీయ సమావేశంలో వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

 తాడేప‌ల్లి: నేడు విద్యుత్ సంస్ధలు వసూలు చేయాలని నిర్ణయించిన ట్రూఅప్ ఛార్జీల విధింపునకు గత ప్రభుత్వహయాంలో చంద్రబాబు అవలంభించిన విధానాలే కారణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు తన పాలనలో అస్తవ్యస్త విధానాల కారణంగా విద్యుత్ సంస్ధలు నష్టాలలో కూరుకుపోయాయని అన్నారు. వాటిని అధగమించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఘనత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం కురుబ కులస్ధుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి కురుబ కార్పోరేషన్ ఛైర్మన్ కోటి సూర్య‌ప్ర‌కాష్ బాబు అధ్యక్షత వహించారు.

సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీలలో పేదరికాన్ని పొగొట్టే లక్ష్యంతో అమలు చేస్తున్న సంక్షేమ పథ‌కాలతో ప్రజలలో శ్రీ వైయస్ జగన్ అంటే ఆదరాభిమానాలు పెరుగుతున్నాయని అన్నారు. దాంతో పచ్చమీడియా, టిడిపితో కుమ్మక్కై దుష్ప్రచారానికి ఒడిగడుతోందన్నారు. ఇటీవల ప‌చ్చ మీడియాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రైతులు రుణ‌గ్ర‌స్తుల‌య్యారంటూ ఒక నివేదిక ప్ర‌చురిస్తూ... అదేదో ఈ ప్ర‌భుత్వ విధానాల‌వ‌ల్ల జ‌రిగింద‌నే విధంగా, ప్ర‌జ‌ల్లో అయోమ‌యం క‌లిగే విధంగా క‌థ‌నం ఇచ్చారు. దానికి 2014 - 2019 మ‌ద్య రైతులు చేసిన రుణాలు ఆధారంగా రైతులు రుణ‌గ్ర‌స్తుల‌య్యార‌నేది వాస్త‌వం. అంటే చంద్రబాబు పాలనలో అవలంభించిన రైతు వ్యతిరేకవిధానాల కారణంగా రైతులు అప్పులపాలైన విషయం దాచిపెడుతూ అదేదో ఈ ప్రభుత్వంపైకి నెట్టే విధంగా కధనాలు ప్రచురిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా పేదరికాన్ని అనుభవిస్తున్న వివిధ వర్గాల వారికి పింఛన్ లు 60 లక్షల మందికి పైగా అందచేస్తుంటే ఆ విషయంలో కూడా పింఛన్ లు తొలగిస్తున్నారంటూ పెద్దఎత్తున దుష్ప్రచారానికి ఒడిగట్టారన్నారు. దీనిని సరైన రీతిలో ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. కురుబ కులస్ధులు చైతన్యవంతులైన వారని అంటూ ఆ కులానికి సంబంధించి శ్రీ వైయస్ జగన్ తగిన విధంగా ప్రోత్సాహం అందించారన్నారు. ఆ కులంలో ఇద్దరు ఎంఎల్ ఏలు, వారిలో ఒకరు మంత్రిగా ఉన్నారన్నారు. అదే విధంగా ఎంపీగా కూడా ఉన్నారన్నారు. కురబ కులస్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. బిసి కులాల్లో వెనకబడిన కులాల్లో నేతలు నాయకత్వలక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. కురబ కులస్ధులు రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా నివసిస్తున్నారని వారి అభివృధ్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

పార్లమెంట్ సభ్యుడు   గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కురబ కులస్ధులు శాంతికాముకులని అన్నారు. శ్రీ వైయస్ జగన్ కురబ కులస్ధులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని అందుకు కురబ కులస్ధులందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సిఐగా ఉన్న తాను, నేడు పార్లమెంట్ కు వెళ్లగలిగానంటే దానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అని ఆయనకు ఎప్పటికి రుణపడిఉంటానన్నారు. కురబ లు ప్రధానంగా గొర్రెలను మేపుకుంటూ ఆ వృత్తిలో కొనసాగుతుంటారని వారికి కావాల్సిన సహాయం అందించాలని కోరారు.అదే విధంగా కురబలు అన్ని రంగాల లో అభివృధి సాధించే విధంగా తమ వంతు కృషి చేయడంజరుగతుందన్నారు.

పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ బిసి కులాల సమస్యలను తెలుసుకుని వాటిని ప్రణాళికాబధ్దంగా పరిష్కరించాలనే లక్ష్యంతో బిసి కుల కార్పోరేషన్ల ద్వారా ఆయా కులస్ధుల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పార్టీ కేంద్ర కార్యాలయం వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు సిధ్దంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఎంఎల్సి  జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ బిసి కులాల అధ్యయనం, ఆ తర్వాత వారి సమస్యల పరిష్కారానికి బిసి గర్జన ల ద్వారా బిసికులాలకు తన ప్రాధాన్యతను శ్రీ వైయస్ జగన్ ఎప్పుడో తెలియచేశారన్నారు. అధికారంలోకి వచ్చాక బిసి కులాలకు రాజ్యాంగబధ్ద రిజర్వేషన్లు లేకపోయినా జనాభా దామాషాగా పదవులను ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని అందుకోసం బిసిలందరూ శ్రీ వైయస్ జగన్ కు అండగా నిలవాలన్నారు.

సమావేశంలో రాష్ర్ట బిసి సంక్షేమ శాఖమంత్రి  సిహెచ్ వేణుగోపాల కృష్ణ, రాష్ట్ర రోడ్లు మ‌రియు భ‌వ‌నాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎంఎల్ఏ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, కురబ కార్పొరేషన్ డైరక్టర్లు, కురబకుల రాష్ర్ట నేతలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top