వైయ‌స్ జగన్‌ను చంపాలన్న వ్యక్తిని స్పీకర్ చేయడమేంటి?

అధికార పార్టీ తీరుపై వైయస్ఆర్‌ సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం 

స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి ఎంపికలో రాజ్యాంగం పరంగా సంప్రదాయాలను తుంగలో తొక్కారు.

సభను నడిపబోయే వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిని చంపాలని మాట్లాడారు. 

అంత  దారుణమైన మనస్తత్వం కలిగిన వారు రేపు సభలో మాట్లాడనిస్తారా?    

 ప్రజా సమస్యలు మాట్లాడటానికి అవకాశం ఇస్తారా?

తాడేపల్లి:  స్పీకర్ గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోవడం తెలుగుదేశం పార్టీ సొంత నిర్ణయమని.. అయితే రాజ్యాంగం పరంగా సంప్రదాయాలను తుంగలో తొక్కి మీరు అయ్యన్న పాత్రుడిని స్పీకర్ గా నిర్ణయించేటప్పుడు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని మీరు సంప్రదించారా? అని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ప్రశ్నించారు. ’’తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలను వీడియోలు పరిశీలించాలన్న ఆయన….  శాసనసభ్యుడిగా లేనప్పుడు జగన్మోహన్ రెడ్డిగారిని ఉద్దేశించి బూతులు మాట్లాడిన తీరు ఏ విధంగా మర్చిపోతామన్నారు. 
అంటే శాసనసభలోకి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు రాకూడదు, మాట్లాడకూడదు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే అయ్యన్న పాత్రుడిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారని ఆయన ఆక్షేపించారు. 
అయ్యన్న పాత్రుడు తన మిత్రుడితో కూర్చొని వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, పూర్తిగా పామును కొట్టినట్లు కొట్టి చంపేయాలంటూ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాకు ప్రదర్శించారు. సభను నడిపే స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడిని చంపాలని మాట్లాడారు. అంత కఠినమైన, దారుణమైన మనస్తత్వం కలిగిన వారు రేపు సభలో మాట్లాడనిస్తారా? ప్రజా సమస్యలు మాట్లాడటానికి అవకాశం ఇస్తారా? మీరు అసలు చట్టసభను గౌరవించారా? కేవలం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారిని అవమానపర్చడానికేనా మీ అందరినీ గెలిపించి అసెంబ్లీకి పంపినది.’’ అని సుధాకర్ బాబు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ప్రజలను మభ్యపెట్టేందుకు కాకుండా మీరు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాలని కోరుతున్నామన్నారు.

తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. 
రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్త ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల్లోనే విధ్వంసానికి అర్థం చెప్పిందని సుధాకర్ బాబు మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ భవనాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కూల్చివేయడం దారుణమన్నారు. అన్ని అనుమతులు తీసుకున్నా, కోర్టు ఆదేశాలున్నా బేఖాతరు చేసి బుల్డోజర్లతో తమ పార్టీ కార్యాలయాన్ని తొక్కించేయడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనమన్నారు. 

ప్రతిపక్షం లేకుండా చేసే కుట్ర
రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే ఉండకూడదని, వాళ్ల పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఉండకూడదని, వాళ్లు అసలు మాట్లాడనే కూడదని దుర్మార్గపు నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సుధాకర్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు పాలన మొదలు పెట్టినప్పటి నుంచి దాడులు దాడులు జరుగుతున్నాయని, ఆస్తులు ధ్వంసం చేయబడుతున్నాయన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను హత్య చేస్తున్నారని, అవమానపరుస్తున్నారన్నారు. ఫోన్ కాల్స్ ద్వారా మాటల దాడి చేస్తున్నారని, చివరకు తమ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా కూల్చివేసే పరిస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

 ప్రభుత్వానికి సంబంధించిన విలేజ్ క్లినిక్ లు, ఆర్బీకేలు.. ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న భవనాల రాళ్లను భవనాలను ధ్వంసం చేసే ఈ నియంతృత్వ పాలన.. ఈ ప్రభుత్వ వైఖరిగా కనిపిస్తోందన్నారు.

కక్ష సాధింపు తప్ప సాధించిందేమిటి?
అసలు రాష్ట్రంలో రాజ్యాంగం అమలులో ఉందా? వ్యవస్థలను అమలు పరుస్తున్నారా? అతిక్రమిస్తున్నారా? భయంకరమైన వాతావరణాన్ని నెలకొల్పడం ద్వారా కక్ష సాధింపు తప్ప మీరు సాధించింది ఏమైనా ఉందా? అమలు పరచలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మీరు చెప్పిన ప్రతి హామీనీ అమలు పరచాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జూలై నుంచి ఇవ్వాల్సిన వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఇప్పటి నుంచే ఒక పన్నాగ కార్యక్రమంగా అలజడులు రేపించి, రాష్ట్రంలో అల్లర్లు చేపించాలని మమ్మల్ని రెచ్చగొట్టడమే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతోందన్నారు. చంద్రబాబు పరిపాలన ఈ పదిరోజుల్లోనే.. ప్రజలను హింస పెట్టడం, ప్రతిపక్షాలను తొక్కేయటం, ధ్వంసం, హత్యలు చేయడం, రాష్ట్రంలో నుంచి పరారు కావాలని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారని సుధాకర్ బాబు తెలిపారు.

కూల్చేయడం, తర్వాత క్రమశిక్షణ సూక్తులా?
 సీఎం చంద్రబాబు ఉదయం 5.30 గంటలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేశాడు, 9.30 గంటలకు అసెంబ్లీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారిని చంపుతానన్న వారిని 10 గంటలకు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. రాష్ట్రంలోని అక్రమ కట్టడాల వివరాలన్నీ 5 నిమిషాల్లో మీరు తెప్పించుకోగలుగుతారు. అందులో కరకట్టకు, కృష్ణా నదికి మధ్యలో ఉన్న మీ నివాసం కూడా అక్రమమేనని గతంలో మంత్రిగా పని చేసిన  దేవినేని ఉమా గారు ఆ బిల్డింగ్ యజమానులకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా?’’ అని సుధాకర్ బాబు ప్రశ్నించారు. తాము కట్టించిన కట్టడాలన్నీ అక్రమమని మాట్లాడుతున్నారని, ఇది పూర్తిగా తప్పు అన్నారు.
 ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే కట్టడాలు కడుతున్నామని, అక్రమంగా, ఇల్లీగల్ గా నిర్మాణాలు జరగలేదని స్పష్టం చేశారు.

Back to Top