కూటమి కుట్రలకు భయపడే ప్రసక్తే లేదు

నామినేషన్ల హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతాం

కడపలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా స్పష్టం

కడప: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో కడప నగరంలోని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌.బి. అంజాద్‌ బాషాకు పోలీసులు నోటీసులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇతర వ్యక్తులను ఉపయోగించుకుని దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

కుట్రలు, బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. పోలీసులు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వెనుకడుగు వేయవని, తమ అభ్యర్థుల నామినేషన్‌ హక్కులను కాపాడుకునేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని తెలిపారు. ప్రతి అభ్యర్థికి స్వేచ్ఛగా నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top