తాడేపల్లి: అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగే అర్హత బీఆర్ నాయుడు వంటి నీచుడికి లేదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ... శ్రీవారి పట్ల ఏ మాత్రం భక్తప్రవక్తలు లేని దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవిని అప్పగించిన నాటి నుంచి తిరుమల పవిత్రత మంటగలవడం ప్రారంభమైందని అన్నారు. టీవీ చానెల్‌ను నడుపుతూ అర్థరాత్రి బూతుబొమ్మలను ప్రసారం చేసిన దుర్మార్గమైన వ్యక్తికి, అత్యంత పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టి సీఎం చంద్రబాబు మహాపాపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు న్యూజెన్, ఆర్థోజెన్ వంటి ఆయిల్స్‌ను ప్రచారంలోకి తీసుకువచ్చి, పెద్ద ఎత్తున ప్రజలను లూటీ చేసిన మోసగాడు బీఆర్ నాయుడు అని ధ్వజమెత్తారు. నిత్యం గోవిందనామ సంకీర్తనలతో అలరారే తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడుతున్న నికృష్ణుడు బీఆర్ నాయుడు అని ఆక్షేపించారు. ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత అతడికి లేదని, తక్షణం బీఆర్ నాయుడిని తొలగించి, హిందువుల మనోభావాలు, శ్రీవారి పవిత్రత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... టీటీడీ చరిత్రలో అనేక మంది చైర్మన్‌లను ప్రజలు చూశారు. కానీ బీఆర్ నాయుడు వంటి గలీజు వ్యక్తిని తొలిసారి చూస్తున్నాం. ఏ మాత్రం అర్హత లేని, స్థాయి లేని, ఒక టీవీ చానెల్‌కు, ఒక పవిత్రమైన టీటీడీ వంటి సంస్థకు చైర్మన్‌గా ఉండే ఒక్క లక్షణం కూడా లేని నీచమైన వ్యక్తి బీఆర్ నాయుడు. చంద్రబాబుకు ఊడిగం చేసినందుకే ఆయనకు ఈ పదవిని కట్టబెట్టారు తప్ప మరే అర్హతతోనూ ఆయన ఈ పదవిలో కూర్చోలేదు. ఆయన వల్ల తిరుమల పవిత్రతకే కళంకం కలుగుతోంది. ప్రతిరోజూ అపచారాలు జరుగుతున్నాయి. ఆయన చైర్మన్ గా వచ్చినప్పటి నుంచి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు మాట్లాడితే ఇదే చానెల్‌లో పందికొవ్వు, చేపల కొవ్వు కలిసిందంటూ బీఆర్ నాయుడు తప్పుడు ప్రచారం చేశాడు. అలాగే తన చానెల్‌లో అర్థరాత్రి మిడ్‌నైట్ మసాలా పేరుతో అసభ్య కార్యక్రమాలను నిర్వహించి, టీఆర్పీ రేటింగ్‌ల కోసం ప్రాకులాడిన వ్యక్తి బీఆర్ ఆనయుడు. పవిత్రమైన టీటీడీ చైర్మన్ గా ఆయనను నియమించడం దారుణం. కొండమీద బెల్ట్ షాప్‌లు, మాంసాహారం, అన్యమత ప్రచారం, గోమాతల మృత్యువాత, భోజనంలో నాసిరకం పదార్థాలు, మద్యం సేవించి కొండపై వీరంగాలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించడంలో బీఆర్ నాయుడు విఫలమయ్యాడు. తిరుమల శ్రీవారిపై ప్రమాణం చేస్తావా? అజయ్ అనే వ్యక్తిని వైయస్ జగన్ గారు తాడేపల్లి క్యాం్ ఆఫీస్‌కు పిలిచి, తుపాకీ గురి పెట్టాడని బీఆర్ నాయుడు మాట్లాడారు. తిరుమల వెంకటేశ్వరర్వసామిపై బీఆర్ నాయుడు, అజయ్ అనే వ్యక్తి ప్రమాణం చేసి ఇది నిజం అని చెప్పగలరా? కనీస వ్యక్తిత్వం, నైతిక విలువలు లేని బీఆర్ నాయుడికి తిరుమల కొండపై అడుగు పెట్టే అర్హతే లేదు. వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నారని అయిదేళ్ళ పాటు కనీసం తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని వ్యక్తి బీఆర్ నాయుడు. తన వ్యాపార అవసరాల కోసం శ్రీవారి సన్నిధిని, టీటీడీ పదవిని వాడుకుంటున్నాడు. తాజాగా ఓబెరాయ్ హోటల్‌కు టీటీడీకి చెందిన విలువైన స్థలాన్ని అప్పగించాడు. మద్యం, మాంసాహారం లభించే ఈ హోటల్‌కు శ్రీవారి ఆస్తులను ఎలా కట్టబెట్టాడో బీఆర్ నాయుడే చెప్పాలి. స్వామివారి పట్ల ఏమాత్రం భక్తిభావం ఉన్నా ఇలా చేస్తాడా? జూబ్లీహిల్స్ క్లబ్ వేదికగా తన ఇద్దరు కుమారులను కూర్చోబెట్టి, దేశ వ్యాప్తంగా ఉన్న వీఐపీలు, వ్యాపారులకు శ్రీవారి సేవలు చేయస్తామంటూ, వారిని రప్పించుకోవడం, వారిద్వారా తన వ్యాపార అవసరాలను తీర్చుకోవడం చేస్తున్నారు. ఒక దొంగల ముఠాగా ఏర్పడి తిరుమల పవిత్రతను తమ స్వార్థానికి, వ్యాపార అవసరాలకు వాడుకుంటున్న నీచుడు బీఆర్ నాయుడు. కొండపై బీఆర్ నాయుడు వీఐపీ టిక్కెట్ల బ్లాక్ మార్కెట్ దందాను నడుపుతున్నాడు. టీటీడీ బోర్డ్ మెంబర్ గా ఉన్న పనబాక లక్ష్మి వంటి వారు తాము ఢిల్లీకి శ్రీవారి లడ్డూను తీసుకువెడితే, మేం తినమూ అని నిరాకరించారంటూ మాట్లాడించడం వారి దివాలాకోరుతనంకు నిదర్శనం కాదా? ఇంతగా తిరుమలను భ్రష్టు పట్టిస్తున్న ఘనుడు బీఆర్ నాయుడు. గత అయిదేళ్ళ వైయస్ జగన్ గారి ప్రభుత్వంలోనూ, ఇప్పుడ ఈ పదిహేను నెలల్లోనూ టీటీడీలో జరుగుతున్న దానిపై సీబీఐ విచారణకు సిద్దమా? బీఆర్ నాయుడి అసమర్థత, నిర్లక్ష్యం వల్ల ఆరుగురు భక్తులు మృతి చెందారు. అటువంటి వ్యక్తిని తక్షణం ఆ పదవి నుంచి తప్పించి, టీటీడీ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.