“ప్యాకేజ్ బంధం బయటపడింది” 

టీడీపీ, జనసేనలకు చురకలు అంటించిన వైయ‌స్ఆర్ సీపీ

పార్టీని తాకట్టు పెట్టి దత్తపుత్రుడు అనిపించుకున్నావని విమర్శ

జీవితంలో పవన్‌ ఇంకోసారి సీఎం అని అనొద్దని  వైయ‌స్ఆర్‌సీపీ  సూచన

అమరావతి:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఏ-1 నిందితుడిగా ఉన్న చంద్రబాబుతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గురువారం సెంట్రల్‌ జైల్‌లో ములాఖత్‌ అయ్యారు. అనంతరం పవన్‌ కళ్యాణ్‌.. టీడీపీతో పొత్తును ప్రకటించారు. ఈ విషయాన్ని జనసైనికులు అర్థం చేసుకోవాలని వారికి ఏవో కొత్త భ్రమలు కల్పించే ప్రయత్నం చేశాడు పవన్‌ కళ్యాణ్‌. వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీని ఆపేందుకే టీడీపీతో పొత్తు అంటూ తన పాత పల్లవినే పాడారు. 

 
దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ స్పందించింది.  ‘నువ్వు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌కి వెళ్ళింది టీడీపీతో పొత్తును ఖాయం చేసుకునేందుకనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యింది. . ఇన్నాళ్ళూ నీమీద న‌మ్మ‌కం పెట్టుకున్న‌ అభిమానుల‌కు, కాస్తో కూస్తో నిన్ను న‌మ్మిన వాళ్ళ‌కు ఈరోజుతో భ్ర‌మ‌లు తొల‌గించేశావు.ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం అని వైయ‌స్ఆర్‌సీపీ స్పష్టం చేసింది.

Back to Top