ఉత్సాహంగా వైయస్‌ఆర్‌సీపీ నేతల నామినేషన్లు

అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల నామినేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇవాళ పులివెందులలో పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్ది సేపట్లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. పలాస వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా సీదరి అప్పలరాజు, ఇచ్చాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పిరియా సాయిరాజ్, పాతపట్నం అభ్యర్థిగా రెడ్డిశాంతి,  కురుపాం అభ్యర్థివగా పుష్పశ్రీవాణి, వైయస్‌ఆర్‌ జిల్లా కడప అభ్యర్థిగా షేక్‌ అంజాద్‌ బాషా, కైకలూరు అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు, విజయవాడ వెస్ట్‌ అసెంబ్లీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థిగా పీవీపీ, హిందూపురం అసెంబ్లీఅభ్యర్థిగా రిటైర్డ్‌ ఐజీ ఇక్బాల్‌ రాప్తాడు అసెంబ్లీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, పుట్టపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీధర్‌రెడ్డి, శింగనమల అభ్యర్థిగా జొన్నలగడ్డ పద్మావతి, పెడన అభ్యర్థిగా జోగి రమేష్, తదితరులు నామినేషన్‌ దాఖలు చేశారు.
 

Back to Top