మందా సాల్మన్‌ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం

  

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన వైయ‌స్ఆర్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ కుటుంబానికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. సాల్మన్‌ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్ధిక సాయం పార్టీ తరుపున వైయస్‌ జగన్‌ ప్రకటించినట్లు గురజాల వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ కాసు మహేష్‌ రెడ్డి తెలిపారు. సాల్మన్‌ కుటుంబ సభ్యులతో ఇప్పటికే వైయస్ జగన్‌ ఫోన్‌లో మాట్లాడి ఆయన ఆ కుటుంబానికి పూర్తి అండగా నిలబడతామన్న భరోసా ఇచ్చారని మహేష్‌ తెలిపారు.

Back to Top